ప్రతి పూజలో వాడే నందివర్ధన పూలు.. గుత్తులు గుత్తులుగా పూయాలాంటే ఇలా చేయండి 

Samatha

18 April 2026

ప్రతి ఒక్కరి ఇంటిలో పూల మొక్కలు అనేవి తప్పకుండా ఉంటాయి. ముఖ్యంగా పూజకు ఉపయోగించే మొక్కలు చాలా మంది పెంచుకుంటారు.

పూల మొక్కలు

అయితే పూజకు ఉపయోగించే పూల మొక్కల్లో నంది వర్ధన పూలు మందు వరసలో ఉంటాయి. ఇవి చూడటానికి తెలుపు రంగులో మల్లె పూల మాదిరి ఉంటాయి.

పూజలో ఉపయోగించడం

చాలా వరకు ప్రతి పూజలో వీటిని తప్పకుండా ఉపయోగిస్తారు. అయితే సమ్మర్‌లో కూడా ఈ చెట్టు నిండుగా పూలు పూయాలి అనుకుంటున్నారా?

చెట్టు నిండా పూలు

 అయితే ఈ చిన్న సింపుల్ ట్రిక్స్ పాటించడం వలన వేసవిలో కూడా నంది వర్ధన పూలు గుత్తులు గుత్తులుగా పూస్తాయంట. ఆ చిట్కాలు ఏవి అంటే?

సింపుల్ చిట్కాలు

నంది వర్ధన మొక్క చాలా వేపుగా గుబురుగా పెరుగుతుంది. అందువలన ఈ మొక్కను తప్పకుండా వేపుగా పెరిగే కొద్ది కట్ చేయాలి.

కత్తిరింపులు

ఇలా చేయడం వలన కొత్త కొమ్మలు వచ్చి, చెట్టు బాగా పూలు పూస్తుంది. అదే విధంగా బాగా ఎండ తగిలే ప్రదేశంలో ఉంచకూడదు.

ఎండ తగిలే ప్రదేశం

తప్పకుండా ఈ మొక్కకు ఒక రోజు తర్వాత మరొక రోజు.. ఇలా ఒక రోజును తప్పించి మరో రోజు సాయంత్రం నీళ్లు పోయాలి.

రోజు తర్వాత రోజు నీళ్లు పోయడం

అలాగే కుండీలో మొక్క ఉంటే మట్టిని కదిలించి నీళ్లు పోయాలి. ఇలా చేయడం వలన మొక్క వేపుగా పెరుగుతుంది. అలాగే తప్పకుండా ఆవు పేడను ఎరువుగా వేయాలి.

మట్టిని కదిలించడం