కాలి వేళ్ళకు పెడిక్యూర్ చేస్తే.. లాభాలు బోలెడు..
08 October 2025
Prudvi Battula
పెడిక్యూర్‌లోని మసాజ్ కేవలం విశ్రాంతిని ఇవ్వడమే కాదు, ఇది మీ పాదాలు, కాళ్ళకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. వాపు, అలసటను తగ్గిస్తుంది.
ఫంగల్ ఇన్ఫెక్షన్లు లేదా ఇన్గ్రోన్ కాలి గోళ్లు వంటి సమస్యలను పెరగకముందే గుర్తించి సరైన జాగ్రత్తలు తీసుకోవచ్చు.
పెడిక్యూర్ ద్వారా చనిపోయిన చర్మాన్ని తొలగించవచ్చు. ఇది పగుళ్లు, కాల్సస్ మడమల మీద పేరుకుపోవడాన్ని నివారిస్తుంది.
పెడిక్యూర్‌లో గోళ్లను కత్తిరించి శుభ్రపరచడం వల్ల ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. గోళ్లు బలంగా ఉంటాయి. రంగు మారడాన్ని తగ్గిస్తాయి.
పెడిక్యూర్‌లోని గోరువెచ్చని నీటిలో పాదాలను ఉంచి కొంతసేపు కూర్చోవలసి ఉంటుంది. దీన్ని టచ్ థెరపీ అంటారు.
ఈ టచ్ థెరపీ ద్వారా కార్టిసాల్ స్థాయిలను తగ్గించవచ్చు. ఒత్తిడి, ఉద్రిక్తతకు వీడ్కోలు చెప్పడానికి సులభమైన మార్గం.
పెడిక్యూర్ చేసుకోవడం వల్ల పాదాలు శుభ్రంగా మారుతాయి. క్రమం తప్పకుండా చేయించుకుంటే దుర్వాసన, బ్యాక్టీరియా దూరం అవుతాయి.
పెడిక్యూర్ కాలి వేళ్లును, మృదువుగా మారుస్తుంది. ఇది పాదాలను ఆరోగ్యం ఉంచుతుంది. ఇన్ఫెక్షన్లు దూరం అవుతాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఇంటి ముందు కొబ్బరి చెట్టును పెంచవచ్చా.? పండితుల మాటేంటి.?
ఫ్రెంచ్ ఫ్రైస్తో షుగర్ వస్తుందా.? పరిశోదనలు ఏం చెబుతున్నాయి.?
పీతలను డైట్లో చేర్చుకున్న ఆదిలాబాద్ ప్రజలు.. కారణం అదేనా.?