నోటి నుండి దుర్వాసన వస్తుందా.? ఇవి తింటే సమస్య కథ క్లైమాక్స్‎కే.. 

11 August 2025

Prudvi Battula 

పుదీనా, తులసి ఆకులు నమలడం వల్ల నోటిలోని బ్యాక్టీరియాను నాశనం చేసి తాజా శ్వాసను అందిస్తాయి. దీంతో నోటి దుర్వాసన పోతుంది.

గోరువెచ్చని నీటిలో కొద్దిగా బేకింగ్ సోడా కలుపుకొని నోటిలో వేసుకొని పుక్కలించడం వల్ల బ్యాక్టీరియా తొలగిపోయి దుర్గంధం తగ్గుతుంది.

చూయింగ్ గమ్ కూడా నోటి దుర్గంధాన్ని దూరం చేస్తుంది. అయితే దీని కోసం మీరు షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్ నమలడం మంచిది.

మీ నోటి నుంచి దుర్వాసన వస్తే గ్రీన్ టీ తాగితే ఉపశమనం లభిస్తుంది. ఇది ఆరోగ్యానికి కూడా ఎంతగానో మేలు చేస్తుంది.

నోటి దుర్వాసన దూరం చేయడానికి నిమ్మరసం తాగడం కూడా మంచిదే. ఇందులోని యాసిడ్ నోటిలో బ్యాక్టీరియాను పూర్తిగా తొలగిస్తుంది.

రెండు లవంగలు నోటిలో వేసుకుని నమలడం వల్ల మొత్తం బ్యాక్టీరియా తొలగిపోయి నోటి దుర్గంధం చిటికలో దూరమవుతుంది.

వాటర్‌లో కొన్ని కీరదోస ముక్కలు వేసుకొని తాగడం వల్ల దుర్గంధం పూర్తిగా పోతుంది. దీంతో మీ నోరు తాజాగా మారుతుంది.

జింక్ గ్లుకోనేట్, క్లోరిన్ డై ఆక్సైడ్ కలిగి ఉన్న మౌత్ వాష్ వాడటం వల్ల కూడా నీతో దుర్వాసన దూరం అవుతుంది.