చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోతుందా.? ఈ ఫుడ్స్‎తో సమస్య కథ కాటికే..

13 August 2025

Prudvi Battula 

మీరు ​ఉసిరికాయ ఉసిరి తినడం వల్ల జుట్టు పొడుగ్గా, బలంగా మారుతుంది. అలాగే తెల్ల జుట్టు కూడా నల్లగా మారుతుంది.

గుడ్డు జుట్టులో మెలనిన్ ఉత్పత్తిని సహజంగా పెంచడంలో సహాయపడుతుంది.మీ జుట్టును నల్లగా, సిల్కీగా చేస్తుంది.

క్యారెట్లు తెల్ల జుట్టు సమస్య తగ్గడంతో పాటు శరీరంలోని హిమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరుతై. జుట్టులో రక్త ప్రసరణను పెంచుతాయి.

క్యారెట్ తినడం వల్ల అకాల బూడిద జుట్టు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. మీ రోజువారీ ఆహారంలో క్యారెట్ చేర్చుకోవాలి.

బ్రకోలీ ఒక సూపర్ ఫుడ్. ఇది తింటే రోగనిరోధక శక్తి బలపడుతుంది. క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది. అలాగే ఇతర వ్యాధుల నుంచి రక్షిస్తుంది.

తెల్ల జుట్టు సమస్య ఉన్నవారికి బ్రకోలీ బెస్ట్ ఆప్షన్. ఇది సహజంగా మెలనిన్ ఉత్పత్తిని ప్రోత్సహించి జుట్టుకు తగిన పోషణ అందిస్తుంది.

జుట్టును నల్లగా చేయడానికి బ్లాక్ టీ  కూడా ఎంతగానో సహాయపడుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు, టానిక్ యాసిడ్ తెల్ల జుట్టును మాయం చేస్తాయి.

రోజుకు 1 కప్పు బ్లాక్ టీ తాగితే కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గడం మాత్రమే కాకుండా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.