రాత్రుళ్లు ఈ ఫుడ్స్ తింటే.. నిద్రలేమితో సహజీవనం చేసినట్టే..
15 September 2025
Prudvi Battula
కెఫీన్ అనేది నిద్రకు అంతరాయం కలిగించే ఒక ఫుడ్. దీన్ని ఎక్కువ మొత్తంలో తీసుకోవడం తీసుకోవడం వల్ల నిద్రపోవడం కష్టమవుతుంది.
మద్యం కొంతమందికి త్వరగా నిద్రపోవడానికి సహాయపడవచ్చు. కానీ అది నిద్ర విధానాలకు అంతరాయం కలిగించి నిద్ర నాణ్యతను తగ్గిస్తుంది.
నిద్రవేళకు ముందు కారంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల అసౌకర్యం, అజీర్ణం, యాసిడ్ రిఫ్లక్స్ ఏర్పడతాయి. దీనివల్ల నిద్రపోవడం కష్టమవుతుంది.
పడుకునే ముందు అధిక చక్కెర ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఆ తర్వాత నిద్రలేమి సంభవించవచ్చు.
టైరమైన్ అనేది నిద్రకు ఆటంకం కలిగించే అమైనో ఆమ్లం. టైరమైన్ అధికంగా ఉండే ఆహారాలు కొంతమందిలో నిద్రలేమికి దోహదం చేస్తాయి. ఇది ప్రాసెస్ చేసిన మాంసంలో ఎక్కువగా ఉంటుంది.
నిద్రవేళకు ముందు ఎక్కువగా లేదా భారీగా భోజనం చేయడం వల్ల అసౌకర్యం, అజీర్ణం ఏర్పడుతుంది. దీంతో నిద్రపోవడం కష్టమవుతుంది.
సంతృప్త, ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉండే ఆహారాలు మంట అసౌకర్యానికి దారితీస్తాయి. నిద్రకు అంతరాయం కలిగించే అవకాశం ఉంది.
అధిక చక్కెర ఉన్న పానీయాలు తీసుకోవడం రక్తంలో చక్కెర పెరగడానికి దారితీస్తాయి. దీనివల్ల నిద్రపోవడం కష్టమవుతుంది.