నూరేళ్లు పూర్ణాయుష్శుతో బతకాలంటే.. రాగులు ఇలా తీసుకోండి

03 December 2024

TV9 Telugu

TV9 Telugu

సిరి ధాన్యాల్లో ఒకటైన రాగులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఉండే పోషక గుణాలు ఎన్నో వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తాయి

TV9 Telugu

రాగులతో చాలా మంది జావ మాత్రమే కాకుండా రాగి రోటి, రాగి సంగటి, రాగి ఇడ్లీలు ఇలా రకరకాల వంటకాలు చేసుకోవచ్చు. ఇందులో ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలకు బలాన్ని అందిస్తుంది

TV9 Telugu

మనం తీసుకునే ఆహారం మన మానసిక స్థితిపై ప్రభావం చూపిస్తుంది. అందువల్ల రాగిలో యాంటీఆక్సిడెంట్లు ఆందోళనలకు, డిప్రెషన్‌కి గురి కాకుండా తోడ్పడుతాయి

TV9 Telugu

ఆరోగ్యానికి మాత్రమే కాదు. అందానికి కూడా రాగి నేస్తమే అని చెప్పాలి. ఇందులో ఉండే విటమిన్‌ బి3  చర్మాన్ని ముడతలు పడకుండా కాపాడుతుంది. ముఖ్యంగా రాగి రోటీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది

TV9 Telugu

రాగి రోటీలో కాల్షియం, ఫైబర్, ఐరన్, ప్రొటీన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ప్రతి రోజూ ఆహారంలో రాగి రోటీ తినడం వల్ల శరీరానికి ఇతర ప్రయోజనాలు లభిస్తాయి. అవేంటో ఇక్క తెలుసుకుందాం

TV9 Telugu

రాగి రోటీలో కాల్షియం పుష్కలంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీన్ని తీసుకోవడం వల్ల ఎముకలు, కండరాలు దృఢంగా తయారవుతాయి

TV9 Telugu

రాగి రోటీలో అధిక మొత్తంలో ఫైబర్ కూడా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలు నయమవుతాయి

TV9 Telugu

రాగి రోటీలో కేలరీలు తక్కువగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల బరువు వేగంగా తగ్గవచ్చు. ఇందులోని ఐరన్ రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. రక్తహీనతను నివారిస్తుంది