బార్లీవాటర్ ఇలా తీసుకుంటే బోలెడు లాభాలు మీసొంతం..!
Jyothi Gadda
20 February 2025
బార్లీ వాటర్‌లో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్ల ఇది మంచి డిటాక్స్ డ్రింక్‌లా పని చేస్తుంది. బార్లీలోని యాంటీఆక్సిడెంట్లు అధిక బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను నియంత్రిస్తాయి.
గ్లాసు నీళ్లు, బార్లీ, నిమ్మరసం వేసి బాగా మరిగించాలి. బార్లీ నీళ్లు బ్రౌన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత ఆ నీళ్లలో సగం టీస్పూన్ తేనె వేసుకొని తాగాలి. డయాబెటిస్ పేషెంట్లకు చాలా మంచిది.
బార్లీ నీరుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. జీర్ణ క్రియ మెరుగవుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంటాయి. దీంతో బరువు కూడా తగ్గుతారు.
ఇంకా కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. బార్లీ నీటిలో ఉండే పోషకాలు మూత్రపిండాలు, కాలేయ ఆరోగ్యానికి దోహదం చేస్తాయని కొన్ని అధ్యయనాలు నివేదించాయి.
కిడ్నీలో రాళ్లు, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లను కూడా తొలగిస్తుంది. పేగుల్లో ఉండే మలినాలు తొలగిపోతాయి. కేన్సర్ నివారణలో సాయపడుతుంది. బార్లీ నీళ్లతో చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.
బార్లీలో బి-కాంప్లెక్స్, మాంగనీస్, సెలీనియం, ఫాస్పరస్, ఇనుము, కాల్షియం, జింక్ ఖనిజాలు లభిస్తాయి. ఇంకా పీచు పదార్థం, యాంటీఆక్సిడెంట్లు ఫైటో కెమికల్స్ పుష్కలంగా ఉంటాయి.
బార్లీలోని టోకోఫెరోల్ చెడు కొలెస్ట్రాల్ పెరగడాన్ని నిరోధిస్తుంది. బార్లీని కడిగి, గ్లాస్ నీటిలో వేసి మరిగించిన తర్వాత నిమ్మరసం, తేనె కలిపి తాగాలి
బీ విటమిన్, పీచు పదార్థం సంపూర్ణంగా మనకు అందాలంటే పొట్టుతోపాటు బార్లీ గింజలను తీసుకుంటే మంచిది. బార్లీ గింజల్ని బ్రెడ్, సూప్‌లు, ఇతర ఆహార ఉత్పత్తులు,ఆల్కహాలిక్‌లో వాడతారు.