మనలో చాలామంది బంగాళదుంపలను ఎంతో ఇష్టంగా తింటారు. బంగాళదుంపలు తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నా కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
ప్రతిరోజూ బంగాళదుంపలతో చేసిన వంటకాలను తీసుకుంటే శరీరంలో షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. బంగాళదుంపలు తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు.
బంగాళ దుంపలను ఎక్కువగా తీసుకుంటే రక్తంలో షుగర్ లెవెల్స్ కచ్చితంగా పెరుగుతాయి. ఆలూ చిప్స్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల హై బీపీ బారిన పడే అవకాశం ఉంది.
బంగాళదుంపల వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే ఛాన్స్ ఉండగా కొన్ని సందర్భాల్లో పోషకాల లోపం కూడా తలెత్తుతుంది. శరీరంలో క్యాన్సర్ కారక కెమికల్ అక్రిలమైడ్ తయారవుతుంది.
రోజూ బంగాళదుంపలతో చేసిన వంటకాలను తీసుకుంటే మాత్రం టైప్2 డయాబెటిస్ బారిన పడే ఛాన్స్ ఉంటుంది. బంగాళదుంపలు ఎక్కువగా తినేవాళ్లు తీవ్రస్థాయిలో నష్టపోయే ఛాన్స్ ఉంది.
రోజూ బంగాళదుంపలతో చేసిన వంటకాలను తీసుకునే వాళ్లకు ఇన్ ఫ్లమేషన్ ఎక్కువగా ఉండే అవకాశంతో పాటు అలర్జీల బారిన పడే అవకాశం ఉంటుంది.
ఆటూ దీర్ఘకాలంలో ఎన్నో ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఇతర ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న వాళ్లు బంగాళదుంపలకు దూరంగా ఉంటే మంచిది.
బంగాళాదుంపలు రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి గ్లూకోజ్ స్థాయిలను తగ్గించుకోవాలనుకునేవారు తినకపోవడం మేలు.