పానీపూరి ఆ సమస్యలపై మిస్సైల్..

18 September 2025

Prudvi Battula 

పానీపూరిలో గోధుమ పిండి లేదా ఇతర ధాన్యాలతో తయారు చేసిన పూరీలు ఉంటాయి. ఇందులో ఫైబర్‌ జీర్ణ ఆరోగ్యన్నీ మెరుగుపరుస్తుంది.

దీని కోసం ఉపయోగించే శనగలు, బంగాళాదుంపలు, పెరుగు లేదా చింతపండు చట్నీ వంటి ఫిల్లింగ్ పదార్థాలు కండరాల పెరుగుదలకు అవసరమైన ప్రోటీన్‌ను అందిస్తాయి.

పానీపూరి కోసం తయారుచేసే నీటిలోని చింతపండు, పుదీనా, కొత్తిమీర యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి, వాపును దూరం చేస్తాయి.

పానీపూరిలోని పులియబెట్టిన చట్నీలు, పదార్థాలు ఆరోగ్యకరమైన గట్ బాక్టీరియాకు మద్దతు ఇచ్చి సమతుల్య గట్ మైక్రోబయోమ్‌ను ప్రోత్సహిస్తాయి.

పానీపూరిలోని ఫైబర్, ప్రోటీన్ కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

ఇందులో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలు, మూలికలు, జీలకర్ర, కొత్తిమీర వంటివి జీర్ణక్రియకు సహాయపడతాయి. అజీర్ణం, ఉబ్బరం తగ్గిస్తాయి.

పానీపూరిలోని యాంటీఆక్సిడెంట్లు ఇతర పోషకాలు రోగనిరోధక పనితీరును మెరుగుపరచి అనారోగ్యాల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

పరిశుభ్రమైన వాతావరణంలో తయారు చేసిన పానీపూరి తింటేనే ఈ ప్రయోజనాలు ఉంటాయని అంటున్న పోషకాహార నిపుణులు అంటున్నారు.