నేరేడు పండుతో ఇవి తింటే.. విషం తాగినట్టే..

11 September 2025

Prudvi Battula 

నేరేడు పండుతో కలిపి పాల ఉత్పత్తులను తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయని అంటున్నారు పోషకాహార నిపుణులు.

వేయించిన ఆహారాలలో అధిక కొవ్వు, కేలరీల కంటెంట్ కారణంగా వీటిని కలిపి తీసుకొంటే నేరేడు పండులో పోషకాలు విషంగా మారుతాయి.

అధిక చక్కెర ఉన్న ఆహారాలతో జామూన్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అలాగే బరువు పెరిగే అవకాశం ఉంది.

ప్రాసెస్ చేసిన మాంసాలతో జామూన్ తీసుకోవడం వల్ల జీర్ణ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీంతో జీర్ణ సమస్యలు వస్తాయి.

నేరేడు పండును కారంగా ఉండే ఆహారాలతో కలపడం వల్ల కొంతమందిలో జీర్ణ అసౌకర్యం లేదా చికాకు కలుగుతుందని అంటున్నారు వైద్యులు.

నేరేడులో కొన్ని ఆక్సలేట్లు ఉంటాయి. కాబట్టి ఆక్సలేట్లు అధికంగా ఉన్న పాలకూర, దుంపలు వంటివి తీసుకోవడం వల్ల కిడ్నీ రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది.

జామూన్‌తో కలిపి కెఫీన్‌తో కూడిన ఫుడ్స్, పానీయాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ ప్రభావితం కావచ్చు అంటున్నారు.

నేరేడులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఫైబర్ అధికం ఉన్న ఆహారాలతో వీటిని తీసుకొంటే అనారోగ్య సమస్యలు వస్తాయి.