గుడ్లు ఆ సమయంలో మరిన్ని ప్రయోజనాలు.. ఆరోగ్యం ఫుల్..
24 September 2025
Prudvi Battula
గుడ్లతో వివిధ రకాల వంటకాలు తయారు చేయడం సులభం. ఇవి సాయంత్రం చిరుతిండికి అనుకూలమైన, పోషకమైన ఎంపిక అనే చెప్పాలి.
గుడ్లు ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లానికి ఉన్నందున వీటిని సాయంత్రం తింటే సెరోటోనిన్, మెలటోనిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది.
గుడ్లలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. వ్యాయామం చేసేవారు ఇవి సాయంత్రం తింటే కండరాల నిర్మాణానికి సహాయపడుతుంది.
గుడ్లలోని ఆరోగ్యకరమైన కొవ్వులు కడుపు నిండిన భావన కలిగిస్తాయి. అందువల్ల దీన్ని ఈవెనింగ్ తింటే రాత్రుళ్లు తక్కువ తిని బరువు తగ్గుతారు.
ఇందులో వివిధ విటమిన్లు, ఖనిజాలు, విటమిన్ డి, బి12, కోలిన్ మొత్తం ఆరోగ్యాన్నీ మెరుగుపరచడంలో సహాయపడతాయి.
వీటిలో కోలిన్ పుష్కలంగా ఉంటుంది, ఇది మెదడు ఆరోగ్యం, అభిజ్ఞా పనితీరుకు మద్దతు ఇచ్చే పోషకం. దృష్టి, మానసిక స్పష్టతను మెరుగుపరుస్తుంది.
ఇందులో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
దీనిలోని విటమిన్ డి, జింక్ వంటివి రోగనిరోధక శక్తిని మెరుగుపరచి శరీరంలో ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
క్యారెట్ అంటే.. ఆ సమస్యలకు హడల్.. మీ డైట్లో ఉంటే.. నో వర్రీస్..
మునగాకు ఫ్రై రెసిపీ… టేస్ట్ మాత్రమే కాదు.. ఆరోగ్యం కూడా..
సీతాఫలం తీసుకుంటే.. ఆ సమస్యలపై వార్ డిక్లేర్ చేసినట్టే..