చపాతీని వీటితో తింటే.. సమస్యల కుంభస్థలం బద్దలుగొట్టినట్టే..
06 August 2025
Prudvi Battula
చపాతీలు కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. దీంతో నెమ్మదిగా జీర్ణమయ్యే చేసి స్థిరమైన శక్తిని అందిస్తాయి.
గోధుమపిండితో చేసిన చపాతీలలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి పేగు ఆరోగ్యానికి కవచంలా ఉంటుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.
చపాతీల్లో సహజంగా కొవ్వు తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా నెయ్యి, నూనె లేకుండా తీసుకొంటే బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
గోధుమ చపాతీలు కండరాలకి అవసరం అయ్యే ప్రోటీన్‌ను అందిస్తాయి. వీటిని కొన్ని ఫుడ్స్ కలిపి తుసుకుంటే మరిన్ని లాభాలు ఉంటాయి.
దుంపలు, క్యారెట్లు లేదా పాలకూర వంటి కూరగాయలను పిండిలో కలిపి చపాతీలు చేసుకోవడం వల్ల పోషక విలువలు పెరుగుతాయి.
శనగ పిండి, సోయాబీన్ పిండి లేదా చిరు ధాన్యాలు వంటి ఆహారాలతో చపాతీలు తింటే ప్రోటీన్, ఫైబర్ కంటెంట్‌ను పెంచుతాయి.
చపాతీల సంఖ్యను పరిమితం చేయడం, పప్పు ధాన్యాలు లేదా కూరగాయలతో తినడం వల్ల మీ బరువును త్వరగా తగ్గించుకోవచ్చు.
రాత్రిపూట చపాతీ తినడం వల్ల జీర్ణక్రియకు సహాయపడుతుంది. బరువు పెరగకుండా నిరోధించవచ్చు. అయితే మోతాదులో మాత్రమే తినాలి.
మరిన్ని వెబ్ స్టోరీస్
మీ డైట్లో మునగ ఆకులు ఉంటే.. ఆ సమస్యలకు దడ పుట్టాల్సిందే..
కలలో రక్తం, మాంసం, బంగారం కనిపిస్తే.. మంచి చిహ్నమా.? చెడు చిహ్నమా.?
ఈ వస్తువులు ఇంట్లో ఉంటే దరిద్రం సల్సా డ్యాన్స్ చేస్తుంది..