చికెన్‎లో ఈ పార్ట్స్ తింటే.. బాడీ షెడ్డుకే.. 

09 October 2025

Prudvi Battula 

సర్రిగ్గా ఉడికించని లేదా పచ్చి చికెన్ తినడం వల్ల సాల్మొనెల్లా, కాంపిలోబాక్టర్ వంటి బ్యాక్టీరియా పెరుగుతుంది.

ఈ బ్యాక్టీరియా వల్ల కలిగే ఆహార సంబంధిత అనారోగ్యాలు వచ్చే ప్రమాదం ఉంది. దీన్ని నివారించడానికి చికెన్‌ను కనీసం 165°F (74°C) ఉష్ణోగ్రతలో ఉడికించాలి.

కోడి చర్మం, ముదురు మాంసంలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. ఇవి బ్యాక్టీరియాను కలిగి ఉంటాయి. వీటిని సరిగ్గా వండకపోతే ప్రమాదం.

ఇంటిల్లో ఉన్న కోళ్ల గుడ్లు లేదా సాల్మొనెల్లాకు గురైన కోళ్లు సరిగ్గా కుక్ చెయ్యకపోతే ఆహారాన్ని కలుషితం చేస్తాయి.

కాలేయం, మూత్రపిండాలు, ప్రేగులు వంటి కోడి అవయవాలు సరిగ్గా ఉడికించకపోతే.. అవి వ్యాధికారకాలకు మారుతాయి.

ఉడికించిన చికెన్‌ను బ్యాక్టీరియా పెరుగుదల ప్రమాదాన్ని తగ్గించడానికి సరిగ్గా నిల్వ చేయాలని అంటున్నారు నిపుణులు.

ఉడికించిన చికెన్‌ను గది ఉష్ణోగ్రత వద్ద రెండు గంటల కంటే ఎక్కువసేపు ఉంచితే, బ్యాక్టీరియా విస్తరించవచ్చు.

వండిన చికెన్‌ను రెండు గంటల్లోపు లేదా ఉష్ణోగ్రత 90°F (32°C) కంటే ఎక్కువగా ఉంటే ఒక గంటలోపు రిఫ్రిజిరేటర్‌లో ఉంచాలి.