బ్రహ్మజెముడు పండు తింటే ఆరోగ్యానికి మంచిదా.? డాక్టర్ల సూచన ఇదే

12 August 2025

Prudvi Battula 

ప్రాచీన కాలం నుంచే బ్రహ్మజెముడు పండును ఎన్నో సంస్కృతుల్లో ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఔషధంగా వాడుతున్నారు.

ఈ పండుని తరచూ మోతాదులో తీసుకోవడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వివిధ పరిశోధనల్లో వెల్లడైంది.

అమెరికన్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఓ అధ్యయనంలో యాపిల్స్, టమోటాలు, అరటిలో కంటే రెండింతలు ఎక్కువ యాంటీఆక్సిడెంట్‌ల బ్రహ్మజెముడు పండులో ఉంటాయని తెలిపింది.

బ్రహ్మజెముడు పండులో విటమిన్ సీ, ఫ్లేవనాయిడ్స్, బెటాలైన్స్ పుష్కలంగా ఉంటాయని ఈ అమెరికన్ సంస్థ వెల్లడించింది.

ఈ పండులోని పోషకాలు గుండెకు సంబంధించిన వ్యాధిలను, కొన్ని రకాల క్యాన్సర్లను కూడా తగ్గిస్తాయని అధ్యయనాలు చెప్తున్నాయి.

ఇందులో ఉన్న ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా తీసుకుంటే రక్త కణాల పనితీరు మెరుగవుతుంది.

బ్రహ్మజెముడు పండులో పొటాషియం ఎక్కువగా, సోడియం తక్కువగా ఉన్నందున కిడ్నీ వ్యాధులు, అధిక రక్తపోటు ఉన్నవారికి ఉపయోగకరంగా ఉంటుంది.

పేగులు, కిడ్నీలు, కాలేయం, బ్లాడర్‌ను శుభ్రపరిచే గుణాలు ఈ పండులో ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.