మీరూ టీ తయారు చేశాక మిగిలిపోయిన టీ పొడిని పారేస్తున్నారా? 

15 October 2025

TV9 Telugu

TV9 Telugu

టీ పొడితో మనకు టీని తయారు చేసుకొని తాగడం మాత్రమే మనకు తెలుసు. కానీ ఈ టీ తయారు చేసిన తర్వాత మిగిలిపోయిన టీ పొడితో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి

TV9 Telugu

దీనితో మీ అందాన్ని కూడా రెట్టింపు చేసుకోవచ్చని తెలుసా? అవును, టీ పొడిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల ముఖానికి రాసినప్పుడు స్కిన్ టోన్ మెరుగవుతుంది

TV9 Telugu

అంతేకాదు, చర్మంపై ముడతలు తగ్గి అందంగా కనిపిస్తుంది. ఇందుకోసం తాజా టీ పొడి అవసరం లేదు. వాడిన టీ పొడిని కూడా వాడొచ్చు. టీ చేసుకున్న తర్వాత దీనిని ఫిల్టర్ చేసి పడేయకుండా పక్కన స్టోర్‌ చేసుకుంటే సరి

TV9 Telugu

ఓ చెంచా అలోవెరా జెల్ తీసుకొని, దానిలో ఓ చెంచా టీపొడి మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత మసాజ్ చేసి క్లీన్ చేసుకోవాలి. దీనిని వాడడం వల్ల ముఖంపైన ఉండే పెద్ద రంధ్రాలు, ముడతలు, ఫైన్‌లైన్స్ తగ్గుతాయి

TV9 Telugu

మిగిలిపోయిన టీ ఆకులను దుర్వాసనలను తొలగించడానికి ఉపయోగించవచ్చు. టీ ఆకులను ఒక గిన్నెలో వేసి రిఫ్రిజిరేటర్, కప్‌బోర్డ్ లేదా బూట్లలో ఉంచితే దుర్వాసన రానేరాదు 

TV9 Telugu

జిడ్డుగల పాత్రలను శుభ్రం చేయడానికి మిగిలిపోయిన టీ ఆకులను కూడా ఉపయోగించవచ్చు. టీ ఆకులను ఆరబెట్టి, దానితో పాత్రలను శుభ్రం చేసుకోవచ్చు

TV9 Telugu

మిగిలిపోయిన టీ ఆకులు పట్టులాంటి జుట్టు పొందొచ్చు. టీ ఆకులను నీటిలో మరిగించి, దానితో మీ జుట్టును శుభ్రం చేసుకుంటే చుండ్రును తగ్గిస్తుంది. జుట్టుకు మెరుపును జోడిస్తుంది

TV9 Telugu

మిగిలిపోయిన టీ ఆకులు కార్పెట్‌లు, రగ్గుల నుంచి వెలువబే దుర్గంధం తొలగించడానికి సహాయపడతాయి. ఈ ఆకులను ఆరబెట్టి, కార్పెట్‌పై చల్లి, 15 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై వాటిని వాక్యూమ్ చేస్తే దుర్వాసన వదిలిపోతుంది