ఎండాకాలంలో మునగకాయను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ ఏ, ఫ్రీ రాడికల్ కు వ్యతిరేకంగా పోరాడుతాయి. మునగకాయ వల్ల లాభాలు తెలిస్తే..
మునగాలోని పోషకాలు మన చర్మం యవ్వనంగా కనిపించేలా మెరిసేలా చేస్తుంది. మునగకాయలు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ మైక్రోబియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి.
ఇది ముఖంపై ఉండే యాక్నేను తగ్గించేస్తుంది. అంతేకాదు ముఖంపై ఉన్న దురదలు ఉంటే తొలగించేస్తుంది. మచ్చలు, గీతలు నివారించే గుణం మునగకాయలో ఉన్నాయి.
మునగకాయను తరచూ మన డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇందులో ఉండే ఐరన్, విటమిన్ సి, కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. అంతేకాదు రక్త సరఫరాను మెరుగు చేస్తుంది.
మునగ కాయలతో జుట్టు కుదుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. దీంతో జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది. రెగ్యులర్ డైట్ లో మునగకాయ పప్పు లేదా కూర రూపంలో తీసుకోవచ్చు.
మునగకాయలో మెగ్నీషియం, విటమిన్ బి స్ట్రెస్ ను తగ్గిస్తుంది. అంతే కాదు నిద్ర లేమి సమస్యకు చెక్ పెడుతుంది. మూడ్ స్వింగ్స్ తో బాధపడుతున్న వారు మునగకాయ తీసుకోవాలి.
మునగకాయలో న్యూట్రియన్స్ ఉంటాయి. ఇది ఈస్ట్రోజన్ సహాయకరంగా ఉంటాయి. మెటబాలిజం రేటును పెంచి హార్మోనల్ అసమతుల్యత సమస్యను తగ్గించేస్తుంది.
డయాబెటిస్ రోగులకు కూడా మునగకాయ మంచిది. ఇది బీపీ సమస్యను తగ్గించి కిడ్నీ ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడుతుంది. థైరాయిడ్ తో బాధపడే వారికి కూడా మునగకాయ వరం.