వర్షాకాలంలో ఈ టీలు తాగితే.. ఆ సమస్యలపై యమపాశం ప్రయోగించినట్టే..

26 September 2025

Prudvi Battula 

తులసి ఆకుల యాంటిపైరేటిక్, డయాఫోరేటిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి చెమట ద్వారా శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి. వీటి రసం జ్వరాన్ని దూరం చేస్తుంది.

జ్వరం ఉన్నప్పుడు పసుపు పాలు తాగితే త్వరగా తగ్గుతుంది. ఇది శరీరంలో ఇన్ఫెక్షన్‌ను తొలగించి సమస్యను దూరం చేస్తుంది.

పసుపు పాలు తరచూ తాగడం వల్ల ఒళ్లు నొప్పులు తగ్గుతాయి. దీన్ని మీ ఆహారంలో చేర్చుకోవడం ఆరోగ్యానికి మంచిది.

అల్లంలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

వర్షకాలంలోజ్వరం వచ్చినప్పుడు.. అల్లం రసం తాగితే సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని అంటున్నారు పోషకాహార నిపుణులు.

మలేరియా-డెంగ్యూ రోగులకు దాల్చిన చెక్క టీ వరం లాంటిది. ఆయుర్వేదంలో దీన్ని జ్వరానికి ఔషధంగా వాడుతుంటారు.

తిప్పతీగతో కాషాయం చేసుకొని తాగితే జ్వరం త్వరగా తగ్గుతుంది. దీనిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ పైరేటిక్ లక్షణాల కారణంగా మళ్లీ పెరగదు.

అధిక జ్వరం, మలేరియా, ఫ్లూ, డెంగ్యూ, వైరస్ వంటి దూరం కావాలంటే రోజూ వేప ఆకులు నమలండి. వీటిలో బ్యాక్టీరియా, వైరస్‌లను నిర్మూలించే శక్తి ఉంది.