ఇన్‌స్టాలో మీరు లైక్ చేసేది మీ ఫ్రెండ్స్‌కి కనిపించవద్దా? ఇలా చెయ్యండి..
09 August 2025
Prudvi Battula
మీరు ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసి రీల్స్ విభాగానికి వెళ్లి పైన ఉన్న "ఫ్రెండ్స్" ట్యాబ్‌పై నొక్కండి.
తర్వాత మీ సాధారణ రీల్స్ ఫీడ్‌కి తిరిగి మారడానికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న "రీల్స్" ట్యాబ్‌పై మళ్ళీ నొక్కండి.
ఇది జస్ట్ వాటిని చూడటానికి మాత్రమే. మీరు లైక్ రీల్స్ ఫ్రెండ్స్‌కి కనిపించకుండా హైడ్ చేయాలంటే కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి.
ముందుగా మీరు వాడుతున్న స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ను ఓపెన్ చేసి మీ ప్రొఫైల్ చిహ్నంపై నొక్కండి.
ఎగువ కుడి మూలలో ఉన్న మూడు చుక్కలపై నొక్కండి. అందులో మీరు "యాక్టీవ్ ఇన్ ఫ్రెండ్స్ ట్యాబ్"పై క్లిక్ చెయ్యండి.
'హూ కెన్ సి యువర్ లైక్స్ అండ్ కామెంట్స్ ఆన్ రీల్స్ ఇన్ ది ఫ్రెండ్స్ ట్యాబ్' కింద, మీకు ఫాలోవర్స్ యు ఫాలో బ్యాక్', 'నో వన్' అనే రెండు ఎంపికలు కనిపిస్తాయి.
వాటిలో మీరు 'నో వన్' అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మీ స్నేహితులు మీకు నచ్చిన రీల్స్‌ను చూడలేరు లేదా వ్యాఖ్యానించలేరు.
ఇలా చేస్తే మీ ఫ్రెండ్స్‌కి తెలియకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో మీకు నచ్చిన రీల్స్‌ని లైక్ చేయొచ్చు. కామెంట్స్ పెట్టొచ్చు.