చీ చీ నల్లగా ఉన్నాయని మోసపొవద్దు..! నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు..
07 July 2026
Jyothi Gadda
సాధారణంగా మనం మార్కెట్లో నారింజ లేదా ఎరుపు రంగులో ఉండే క్యారెట్లను ఎక్కువగా చూస్తుంటాం. అయితే, వీటికి భిన్నంగా ఉండే నల్ల క్యారెట్లు ప్రస్తుతం ఒక అద్భుతమైన సూపర్ ఫుడ్‌గా ప్రజాదరణ పొందుతున్నాయి.
నల్ల క్యారెట్లలోని గుణాలు శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి, కణాల దెబ్బతినకుండా కాపాడటంలో ఇది అద్భుతంగా సహాయపడుతుంది. తద్వారా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ముప్పు తగ్గుతుంది.
విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో తెల్ల రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపించి, రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. సీజనల్ గా వచ్చే జలుబు, దగ్గు, వివిధ రకాల ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఇది రక్షణ కవచంలా పనిచేస్తుంది.
సాధారణ క్యారెట్ల లాగే నల్ల క్యారెట్లలో కూడా బీటా-కెరోటిన్, విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటాయి. ఇవి కంటి రెటినా ఆరోగ్యాన్ని కాపాడతాయి. వయసు పెరగడం వల్ల వచ్చే కంటి సమస్యలను, రేచీకటిని నివారిస్తుంది. కంటి చూపుకు మంచిది.
నల్ల క్యారెట్లలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, పొటాషియం రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. ఇది రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా నిరోధించి, రక్త ప్రసరణను సాఫీగా సాగేలా చేస్తుంది.
గుండె సంబంధిత సమస్యలను నివారిస్తుంది.
ఇందులో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, ప్రేగుల కదలికలను క్రమబద్ధీకరించి మలబద్ధకం సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని ఇస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఎంపిక.
ఇందులోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని లోపలి నుండి శుద్ధి చేస్తాయి. ఇవి మొటిమలు, మచ్చలను తగ్గించి చర్మానికి సహజమైన మెరుపును ఇస్తాయి. అలాగే, చర్మంపై ముడతలు పడకుండా నిరోధించి వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తాయి.
నల్ల క్యారెట్లను సలాడ్ రూపంలో పచ్చిగా తినవచ్చు, లేదా జ్యూస్, సూప్స్ రూపంలో కూడా తీసుకోవచ్చు. శీతాకాలంలో లభించే ఈ అద్భుతమైన కూరగాయను అస్సలు మిస్ కాకుండా మీ దైనందిన ఆహారంలో భాగం చేసుకోండి.