గోళ్లు కొరికే అలవాటు మీ వ్యక్తిత్వాన్ని సూచిస్తుందా.? 

10 September 2025

Prudvi Battula 

గోళ్లు కొరికే అలవాటు ఉన్నవారు పర్ఫెక్షనిస్టులు. ప్రతిదీ పక్కాగా ఉండేలా చూసుకుంటారు. పనిలో చిన్న తప్పు లేదా తేడా కూడా వీళ్లకు నచ్చదు.

వారు అనుకున్నట్టు పని జరగనప్పుడు ఒత్తిడి, విసుగు, నిరాశగా ఉన్న సమయల్లో గోళ్లను బాగా కొరికుతూ ఉంటారు.

అతిగా ఆలోచించేవారికి కూడా గోళ్లు కొరికే అలవాటు ఉంటుంది. చిన్నదానికి కూడా అవసరానికి మించి ఆలోచిస్తారు.

గంటల తరబడి అతిగా ఆలోచించేవారిలో ఒత్తిడి, ఆందోళన ఉన్నందున వీరు తరచూ అసహనంతో గోళ్లు కొరకడం అలవాటుగా ఉంటుంది.

నలుగురిలో కలవలేని వారు ఎదుటి వ్యక్తితో మాట్లాడేందుకు జంకుతారు. తమ అభిప్రాయన్నీ చెప్పేందుకు ధైర్యం చాలక సతమతమవుతారు.

వారు సిగ్గు, అభద్రతాభావం కారణంగా లేదంటే సొంతంగా ఏదైనా ఆలోచనల్లో ఉన్నప్పుడు ఎక్కువగా గోళ్లను కొరికుతూ ఉంటారు.

ఓపిక లేనివాళ్లు కూడా గోళ్లను ఎక్కువగా కొరికుతూ ఉంటారు. పనిలో ఆలస్యం, వేచి ఉండటం దీనికి కారణం కావచ్చు.

కొంతమందికి కోపంలో ఉన్నప్పుడు గోళ్లు కొరకడం అలవాటుగా ఉంటుంది. వారు ఎదుటి వ్యక్తి నుంచి త్వరగా ఫలితాలను కోరుకుంటాన్నారని అర్థం.