మీ పిల్లల కడుపులో రాళ్లు ఉన్నాయా? కారణం ఇదే కావచ్చు..

Prudvi Battula 

15 September 2025

పిత్తాశయ రాళ్లు వృద్ధాప్యంలో వచ్చే వ్యాధి. కానీ ఇప్పుడు ఈ సమస్య పిల్లలలో కూడా ఎక్కువగా కనిపిస్తోంది. ఇటీవల దేశవ్యాప్తంగా పెరుగుతున్న కేసులు.

కడుపు నొప్పి కారణంగా ఆసుపత్రిలో చేరిన పిల్లలపై ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (IAP) ఒక అధ్యయనం. ప్రతి 200 మంది పిల్లలలో ఒకరికి పిత్తాశయ రాళ్లు ఉన్నాయని గుర్తింపు.

పట్టణ ప్రాంతాల్లో పిల్లల ఆహారం, జీవనశైలిలో వేగంగా మార్పులు. ఫాస్ట్ ఫుడ్, స్వీట్లు నిరంతరం తీసుకోవడం వల్ల పిల్లలలో పెరుగుతున్న కొలెస్ట్రాల్, కొవ్వు.

ఊబకాయం కూడా ఈ సమస్యకు ఒక ప్రధాన కారణం. సకాలంలో పిల్లలపై శ్రద్ధ చూపడం చాలా ముఖ్యమంటున్న వైద్యులు, నిపుణులు.

కడుపులో నిరంతరం నొప్పి పిత్తాశయ రాళ్ల లక్షణం కావచ్చు. సరైన చికిత్సను సకాలంలో అల్ట్రాసౌండ్ చేయించాలంటున్న వైద్యులు.

మందులు, ఆహార మార్పులతో నివారించవచ్చు. పిత్తాశయంలో వాపు ఉంటే, శస్త్రచికిత్స తప్పనిసరి అంటున్నారు నిపుణులు.

పిల్లల శరీరంలో రాళ్ళు ఉంటే కడుపు నొప్పి, వికారం, వాంతి, జీర్ణవ్యవస్థలో ఆటంకాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలా ఉంటే పిల్లలకు వైద్య పరీక్షలు తప్పనిసరి.

పిల్లలకు పండ్లు, కూరగాయలు తినిపించండి. జంక్ ఫుడ్ మానుకోండి. పిల్లల స్క్రీన్ సమయాన్ని తగ్గించండి. వారిని శారీరక శ్రమ చేయనివ్వండి. సకాలంలో వైద్యుడిని సంప్రదించండి.