నిద్ర రావడం అనేది చాలా కామన్. అయితే కొందరికి ప్రయాణసమయంలో నిద్ర వస్తే, చాలా మందికి మాత్రం తిన్న తర్వాత నిద్రపోవాలని అనిపిస్తుంటుంది.
మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు తిన్న తర్వాత నిద్ర ఎందుకు వస్తుందో,ఎందుకు కునుకు తీయాలనిపిస్తుందో, కాగా ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం.
తిన్న తర్వాత నిద్ర రావడానికి ముఖ్యకారణం ఇన్సులిన్ అంట. తిన్న తర్వాత ఇన్సులిన్ స్థాయిలు తగ్గిపోతాయంట. దీని వలన అలసట, కునుకు తీయాలనిపిస్తుందని చెబుతున్నారు వైద్యులు.
అయితే ఇలా తిన్న తర్వాత అతిగా నిద్ర వస్తుంది అనుకునే వారు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు వైద్యులు అవి ఏవో ఇప్పుడు చూద్దాం.
తిన్న వెంటనే నిద్ర వస్తుంది అనుకునే వారు వీలైనంత వరకు అతిగా కాకుండా, చాలా తక్కువ ఆహారం తీసుకోవాలంట. దీని వలన ఈ సమస్య నుంచి బయటపడవచ్చునంట.
ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారాల్లో సెరోటోనిన్ పుష్కలంగా ఉంటుంది. దీని వలన అతిగా నిద్ర వస్తుంటుంది. అందుకే ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలంట.
తిన్న తర్వాత కొంత మంది వర్క్ చేస్తుంటారు. కానీ అలా చేయకుండా కాసేపు, కనీసం ఐదు నిమిషాలైనా వాకింగ్ చేయాలంట. దీని వలన ఆరోగ్యం బాగుండటమే కాకుండా నిద్ర కూడా రాదంట.
కొంత మంది తిన్న తర్వాత స్వీట్స్ తినడానికి చాలా ఇష్టపడతారు. కానీ తిన్న తర్వాత స్వీట్స్ అస్సలే తీసుకోకూడంట. దీని వలన అనేక సమస్యలు వస్తాయంట.