తుమ్ము అనేది ప్రతి ఒక్కరికీ వస్తుంటుంది. కొందరికి జలుబు లేదా డస్ట్ అలెర్జీ ఉన్నప్పుడు తుమ్ములు అనేవి ఎక్కువగా వస్తుంటాయి.
అయితే తుమ్మును ఆపుకోవడం చాలా కష్టం. అంతే కాకుండా, అసలు తుమ్మును ఎవ్వరు కూడా ఆపలేరు, అది దాని వేగంతో వచ్చేస్తూనే ఉంటుంది.
మరి తుమ్మును ఎందుకు ఆపలేరు? అసలు దీని గురించిన కొన్ని ఇంట్రెస్టింట్ విషయాలను ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం పదండి మరి!
ముక్కులో శ్లేష్మం అనే ఒక పొర ఉంటుందంట. దానికి ఏదైనా దుమ్ము లేదా ధూళి వంటి కణం తగిలినప్పుడు, దానిని బటకు పంపేందుకు తుమ్ము వస్తుంటుంది.
ఇది వ్యక్తి ప్రమేయం లేకుండా రావడం జరుగుతుంది. అంతే కాకుండా ఇది మిమ్మల్ని రక్షిస్తుంది కూడా, ఎలాంటి దుమ్మ ధూళి లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటుంది.
అయితే సెకన్స్‌లో జరిగిపోతుంది. అంతే కాకుండా వ్యక్తి ప్రమేయం లేకుండా రావడం జరుగుతుంది కాబట్టి దీనిని ఎవరూ ఆపలేరంట, ఆపడానికి ప్రయత్నం చేసినా సమస్యలు ఎదురు అవుతాయంట
తమ్మును ఆపడం వలన నరాలు, కండారాలు బలహీన పడటం వంటి అనేక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకే ఎప్పుడూ తుమ్మును ఆపుకోవాడినికి ప్రయత్నం చేయకూడదంట.
తుమ్ము ద్వారా బయటకు వచ్చే గాలి చాలా స్పీడ్‌తో ఒత్తిడితో వస్తుంది కాబట్టి, దీనిని ఆపాలని చూస్తే ఇది కళ్లు, చెవులు, ముక్కు, రక్తనాళాలపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు.