అత్యధిక Gen Z యువత ఉన్న దేశం ఏదో తెలుసా?

13 September 2025

Prudvi Battula 

నేపాల్‌లో సోషల్ మీడియా నిషేధానికి వ్యతిరేకంగా Gen-Z యువత నిరసనలు హింసాత్మకంగా మారిన విషయం మనకి తెలిసింది.

నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి భారీ నిరసనలు, ప్రజా వ్యతిరేకత మధ్య వేరే దారిలేక రాజీనామా కూడా చేశారు.

నేపాల్‌లో, ముఖ్యంగా యువతరం, అంటే జనరల్-జెడ్, వీధుల్లోకి వచ్చారు. జెన్ Z లేదా జనరేషన్ Z, దీనిని జూమర్స్ అని కూడా పిలుస్తారు.

వారు చిన్నప్పటి నుంచి స్మార్ట్‌ఫోన్‌లు, ఇంటర్నెట్, స్థిరమైన కనెక్టివిటీతో పెరిగినందున వారు "డిజిటల్ నేటివ్స్"గా ప్రత్యేకతను సంతరించుకున్నారు.

జనరేషన్ Z అంటే 1997-2012 మధ్య జన్మించిన యువతీ యువకులు. 2025కి వీరు సుమారు 13 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు.

ఈ తరం నేడు ప్రపంచ పురోగతిలో పెద్ద పాత్ర పోషిస్తోంది. Gen Z ఏ దేశంలో ఎక్కువగా ఉందో ఈరోజు తెలుసుకుందాం.

కొన్ని కథనాల జెన్ Z జనాభాలో ఎక్కువ మంది చైనాలో ఉన్నారని చెబుతున్నారు. ఇక్కడఅత్యంత ధనిక-అత్యధిక ఖర్చు చేసే తరంగా Gen-Z పరిగణించడం జరుగుతుంది.

భారతదేశంలో కూడా Gen-Z జనాభా చాలా పెద్దది. 2025 డేటా ప్రకారం, భారతదేశంలో దాదాపు 3.77 కోట్ల జనరేషన్-జెడ్ జనాభా ఉంది.