ఆహారం కోసం ఏకంగా మొసలి దంతాలనే క్లీన్ చేసే అతి చిన్న పక్షి ఏదో తెలుసా?
samatha
26 JUN 2025
Credit: Instagram
భూ ప్రపంచంపై మనుషులతో పాటు ఎన్నో రకాల జంతువులు, పక్షులు, క్షీరదాలు ఉంటాయి. అందులో కొన్ని మానవులకు అతిదగ్గరగా ఉంటే మరి కొన్ని ఎక్కువగా అడవీ ప్రాంతాల్లో, సముద్రాల ఒడ్డున ఉంటాయి.
ఇక ప్రతి ఒక్కరూ ఆహారం కోసమే పని చేస్తుంటారు. అయితే ఓ పక్షి కూడా తన పొట్ట నింపుకోవడానికి ఒక పెద్ద జంతువు వద్ద పని చేస్తుందంట.
ఇంతకీ ఆ పక్షి ఏది? ఆహారం కోసం ఏకంగా సరీసృపాల జాతికి చెందిన పెద్ద జంతువు మొసలి వద్ద పని చేయడం ఏంటీ అని ఆలోచిస్తున్నారా? దాని గురించే తెలుసుకుందాం.
ఈజిప్షియన్ ఫ్లోవర్ పక్షి. ఇది ఆఫ్రికాలోనే చిన్న పక్షుల్లో ఇదొక్కటి. అయితే ఈ పక్షి మొసళ్ళతో ఒక అసాధారణ బంధాన్ని కలిగి ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.
ఈజిప్షియన్ ఫ్లోవర్ పక్షులు ఆఫ్రికాలోని సబ్ సహారా ప్రాంతంలోని సరస్సులు, నదుల వెంబడి ఎక్కువ కనిపిస్తాయంట. అక్కడ మొసళ్ళు కూడా ఎక్కువ ఉంటాయంట.
ఎందుకంటే? ఈ పక్షి మొసళ్ళ దంతాల నుంచి ఆహార కణాలను తొలిగిస్తాయంట. అంటే మొసళ్ళకు ఈ పక్షి ఒక టూత్ బ్రష్‌లా పని చేస్తుంది.
దీనికి కూడా ఓ పెద్ద కారణం ఉన్నదంట. మొసళ్ళ దంతాలను ఈ పక్షులు క్లీన్ చేయడం వలన వీటికి ఉచిత భోజనం దొరుకుతుదంట.
అదే విధంగా మొసళ్ళకు కూడా వాటి దంతాలు శుభ్రం అవుతాయంట. అందువలన మొసళ్ళు ఈ పక్షులను ఏమీ చేయవు, ఇవి పరస్పర అనుభందాన్ని కలిగి ఉంటాయని చెబుతున్నారు నిపుణులు.