రూ.500 నోటు ముద్రణ ఖర్చు రూ.2.94. ఈ నోటుపై ఢిల్లీలో 17వ శతాబ్దంలో నిర్మించిన 'ఎర్రకోట' చిత్రాన్ని ముద్రించారు.
రూ.200 నోటు ముద్రణ ఖర్చు రూ.2.93. ఈ నోటుపై మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 2వ శతాబ్దపు నిర్మాణం సాంచి 'బౌద్ధ స్థూపం' చిత్రాన్ని ముద్రించారు.
రూ.100 నోటు ముద్రణ ఖర్చు రూ.1.77. ఈ నోటుపై గుజరాత్ లోని పఠాన్ లో ఉన్న 'రాణీకి వావ్' చిత్రం ఉంటుంది. దీనిని 11వ శతాబ్దంలో నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది.
రూ.50 నోటు ముద్రణ ఖర్చు రూ.1.13. ఈ నోటుపై కర్ణాటక రాష్ట్రం హంపిలో 15వ శతాబ్దంలో నిర్మించిన 'రథం' చిత్రాన్ని ముద్రించారు.
రూ.20 నోటు ముద్రణ ఖర్చు రూ.0.95. ఈ నోటుపై మహారాష్ట్ర ఔరంగాబాద్ జిల్లాలోని ఎల్లోరా గుహల చిత్రాన్ని ముద్రించారు.
రూ.10 నోటు ముద్రణ ఖర్చు రూ.0.96. ఈ నోటుపై ఒడిశా రాష్ట్రంలోని 13వ శతాబ్దంలో నిర్మించిన 'కోణార్క్ సూర్య దేవాలయ రథ చక్రం' చిత్రాన్ని ముద్రించారు.
రూ.2000 నోటు ముద్రణ ఖర్చు రూ.3.54 (రద్దు చేయబడింది). ఈ నోటుపై భారత్ మొట్టమొదటి శాటిలైట్ 'మంగళ్‌యాన్', చిత్రాన్ని ముద్రించారు.
కరెన్సీకి ముందు వస్తు మార్పిడి పద్ధతి అమలులో ఉండేది. క్రీ.శ. 9వ శతాబ్దంలో తొలిసారిగా ద్రవ్య వినియోగం అమల్లోకి వచ్చిందని చెబుతారు. భారత్లో కాగితపు ద్రవ్యాన్ని వాడటం 19వ శతాబ్దంలో మొదలైంది.