చేతికి వాచ్ పెట్టుకోవడం చాలా మందికి ఇష్టం. ముఖ్యంగా స్టూడెంట్స్, ఉద్యోగం చేసేవారు ఎక్కువగా వాచ్ పెట్టుకుంటారు.
అయితే కొంత మంది ఆగిపోయిన వాచ్ కూడా చేతికి పెట్టుకుంటుంటారు. జస్ట్ స్టైల్ కోసం అలాంటి వాచ్ పెట్టుకునేవారు చాలా మంది ఉంటారు.
అయితే ఇలా ఆగిపోయిన వాచ్ చేతికి పెట్టుకోవడం వలన అనేక సమస్యలు తలెత్తుతాయి అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. కాగా, అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వాస్తు ప్రకారం.. ఆగిపోయిన వాచ్ పెట్టుకోవడం వలన వారిలో నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుందంట. దీంతో వారు ఏ పని చేసినా అందులో విఫలం అవుతారంటున్నారు నిపుణులు.
అంతే కాకుండా, ఆగి పోయిన వాచ్ అనేది మీ జీవితంలో మీ ఎదుగుదలకు చాలా అడ్డంకిగా మారుతుందంట. దీని వలన మీరు కెరీర్‌లో ముందుకు సాగలేరంటున్నారు పండితులు.
అదే విధంగా, వ్యక్తిగత విజయాల నుంచి వృత్తిపరమైన విజయం వరకు మన జీవితంలోని ప్రతి అంశాన్ని సమయమే నియంత్రిస్తుంది. అందువల్ల ఆగిపోయిన గడియారం పెట్టుకోవడం వలన పాజిటివ్ ఎనర్జీని ఉండదంట.
ఆగిపోయిన వాచ్ పెట్టుకోవడం వలన శారీరకంగానూ, మానసికంగా మీ జీవితంలో మీరు మంచి పురోగతిని సాధించలేరంట. చాలా వరకు ఆర్థిక సమస్యల చుట్టుముతాయంట.
అందువలన ఎట్టిపరిస్థితుల్లోనూ ఆగిపోయిన లేదా విరిగిపోయిన గడియారాన్ని పొరపాటున కూడా ధరించకూడదంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.