పిచ్చి మొక్క అనుకుంటే పొరపాటే.. చిన్న తీగతో బోలెడు ప్రయోజనాలు!
samatha
19 MAY 2025
Credit: Instagram
మనకు రోడ్లపై చుట్టు పక్కల, ముఖ్యంగా పల్లె టూర్లలో ఎక్కవగా అనేక రకాల మొక్కలు కనిపిస్తుంటాయి. అయితే వాటిని చాలా మంది పిచ్చి మొక్కలు అనుకుంటారు.
అయితే రోడ్డుపై కనిపిచే ఓ మొక్కను చాలా మంది పనికి రాని మొక్క అనుకొని వదిలేస్తారు. కానీ దానితో బోలేడు ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.
ఇంతకీ ఆ మొక్క ఏది అనుకుంటున్నారా? అదే నల్లేరు మొక్క. దీని వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.
నల్లేరు మొక్కలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది చూడటానికి చిన్న ఆకులతో కాడలతో, చాలా దట్టంగా తీగలా పెరిగి ఉంటుంది.
అయితే ఈ మొక్క ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిందంట. దీనిని రోజూ తినడం వలన విరిగిన ఎముకలు అతుక్కోవడమే కాకుండా బోన్స్ బలంగా తయారు అవుతాయంట.
వృద్ధాప్యంలో అస్టియోపోరోసిస్ వంటి సమస్యలో బాధపడుతారు. కీళ్ల నొప్పులు, మొకాల్లనొప్పులతో ఇబ్బది పడుతారు. అలాంటి వారు ఈ మొక్క కాడలను తినడ వలన సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు
అధిక బరువుతో బాధపడుతున్న వారికి ఇది ఓ వరం. నల్లేరు మొక్కన రసం లాగా చేసుకొని ప్రతి రోజూ తాగడం వలన శరీరంలో ఉన్న కొవ్వు కరిగిపోయి చాలా సులభంగా బరువు తగ్గుతారంట.
అంతే కాకుండా ఇది డయాబెటిస్‌ను అదుపులో ఉంచుతుంది. అలాగే దీనిలో ఉండే అధిక ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి,మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది.