నానబెట్టిన బాదం తొక్క తీసి తింటున్నారా? ఇది పెద్ద పొరపాటే..

Samatha

9 july  2025

Credit: Instagram

బాదం ఆరోగ్యానికి చాలా మంచిది.కానీ చాలా మంది వీటిని, నానబెట్టి తినే ముందు పై తొక్క తీసి తింటుంటారు. కానీ అలా అస్సలే చేయకూడదంట.

బాదం తొక్కతోనే బోలేడు ప్రయోజనాలు ఉన్నాయంట. దాని వలన శరీరానికి ఎంతో మేలు జరుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

బాదంపప్పుల తొక్క ఒక పేపర్ లా ఉంటుంది. దీంతో ఎలాంటి ప్రయోజనం ఉండదు అనుకుంటారు. కానీ ఇందులో పాలీ ఫెనాల్స్ అనేది ఉంటుందంట.

పాలీఫెనాల్స్ అనేది  వాపు, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించే ఒక రకమైన యాంటీఆక్సిడెంట్.అందువలన బాదం తొక్క ఆరోగ్యానికి మంచిదంట.

బాదంతో పాటు తొక్క తినడం వలన ఇది చర్మం, కంటి సమస్యలను తొలగించడమే కాకుండా రోగ నిరోధక శక్తిని పెంచుతాయంట.

అలాగే ఈ బాదం తొక్కలో ఉండే విటమిన్ ఈ ,జీవక్రియ సక్రమంగా సాగేలా చేసి గట్ బ్యాక్టీరియాను పెంచుతుందంట.

అంతే కాకుండా బాదం తొక్కలో అధిక ఫైబర్ ఉంటుంది. ఇది శరీరానికి మేలు చేస్తుంది. అందువలన ఎట్టి పరిస్థితుల్లో నానబెట్టిన బాదం తొక్కను తీసేసి తినకూడదంట.

కొంత మంది బాదాన్ని నానబెట్టిన తర్వాత తొక్క తీయకుండా తింటే అది త్వరగా జీర్ణం కాదు అని భావించి తొక్కతీసేస్తుంటారు.

కానీ ఇది అవాస్తవం. తొక్కతోనే అనేక ప్రయోజనాలు ఉంటాయి. బాదంపప్పును తొక్కతో తింటేనే త్వరగా జీర్ణం అవుతుందని చెబుతున్నారు నిపుణులు.