పల్లెటూళ్లలో పొలాలు, చేలల్లో రకరకాల మొక్కలు పెరుగుతుంటాయి. వాటిలో కొన్ని పిచ్చి మొక్కలైతే, మరికొన్ని ఔషధ మొక్కలు ఉంటాయి. ఈ మొక్కలలో తెల్ల గలిజేరు మొక్క ఒకటి.
ఈ తెల్ల గలిజేరు మొక్కలో పుట్టెడు ఔషధ గుణాలు ఉంటాయి. ఆయుర్వేద నిపుణులు ఈ తెల్ల గలిజేరు మొక్కని ఔషధ గనిగా చెబుతారు. ఆయుర్వేదంలో ఈ మొక్కకు పునర్నవ అని పేరు.
కొన్ని ప్రాంతాల్లో దీన్ని గుంట గలిజేరు అంటారు. అయితే మన భారతీయ ఆయుర్వేద శాస్త్రంలో ఈ మొక్కలను ఎన్నో రకాలుగా వాడతారు. ఇది ఎన్నో రకాల వ్యాధులకు దివ్యౌషధం.
ఈ గలిజేరు మొక్కలు రెండు రకాలు ఉన్నాయి. తెల్ల పూలు పూసే దాన్ని తెల్ల గలిజేరు మొక్క అని, ఎర్ర పూలు పూసే దాన్ని ఎర్ర గలిజేరు మొక్క అని అంటారు. ఈ మొక్క నేల మీద పాకుతుంది.
ఈ రెండు మొక్కల ఔషధ గుణాలు ఒకేలా ఉన్నా తెల్ల గలిజేరు మొక్క ఎంతో మంచిదని అంటుంటారు. ప్రతి కణానికి ఆరోగ్యాన్నిచ్చి పునరుజ్జీవితం చేయగల శక్తి ఉంది. అందుకే ఇది పునర్నవ.
అలాగే కిడ్నీ సమస్యలకు దివ్యౌషధంగా కూడా పనిచేస్తుంది. ఈ తెల్ల గలిజేరు ఆకులను ఒక పిడికెడు తీసుకొని వాటిని శుభ్రంగా క్లీన్ చేసి పావు లీటర్ మంచి నీళ్లలో వేసి మరిగించుకోవాలి.
తర్వాత వాటిని చల్లార్చుకొని వడకట్టాలి. ఈ మిశ్రమాన్ని ఉదయం లేవగానే పగడుపున గ్లాస్ తీసుకుంటే కిడ్నీలు క్లీన్ అవ్వటంతోపాటు మూత్రనాళ సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.
ఇలా 21 రోజులపాటు రోజుకు గ్లాసు చొప్పున గుంట గలిజేరు మిశ్రమానని తీసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.