వయసు పెరిగే కొద్దీ మనుషులు కుంచించుకుపోతారా?
08 December
2024
TV9 Telugu
పురుషులు 30 నుండి 70 సంవత్సరాల మధ్య ఒక అంగుళం, స్త్రీలు రెండు అంగుళాలు కోల్పోతున్నారట. 80 ఏళ్ల తర్వాత ఇద్దరూ మరో అంగుళం కోల్పోయే అవకాశం.
వృద్ధాప్యంలో కీళ్ల మధ్య మృదులాస్థి అరిగిపోతుంది. బోలు ఎముకల వ్యాధి వెన్నెముక పొట్టిగా మారుతుందంటున్నారు వైద్యులు.
పెరిగే కొద్దీ లీన్ కండర ద్రవ్యరాశిని కోల్పోతారు. కానీ కొవ్వు పెరుగుతుంది. ఇది సార్కోపెనియా అని పిలువబడే పరిస్థితికి కారణం అంటున్నారు నిపుణులు.
బోలు ఎముకల వ్యాధి కారణంగా ఎముకలు బలహీనంగా మారడానికి, పగుళ్లకు కారణమవుతుంది. ఇది వ్యక్తి పొట్టిగా మారడానికి కూడా కారణమవుతుంది.
ఒక సంవత్సరం లోపల ఒకటి నుండి రెండు అంగుళాలు కోల్పోయే వారికి వెన్నెముక, తుంటి పగుళ్లు, అలాగే పురుషులలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుందంటున్నారు.
మన వయస్సు పెరిగే కొద్దీ మన శరీరంలో వచ్చే కొన్ని మార్పులను మనం నియంత్రించలేకపోయినా కొన్ని అలవాట్లను మార్చుకోవచ్చు.
స్లాచింగ్, శారీరక శ్రమ లేకపోవడం, ధూమపానం, ఆల్కహాల్ లేదా కెఫిన్ అధికంగా తాగడం, విపరీతమైన డైటింగ్, స్టెరాయిడ్స్ తీసుకోవడం మానుకోవాలి.
కాల్షియం, విటమిన్ డి అధికంగా ఉండే డైరీ, పండ్లు, కూరగాయలు వంటి ఆహారాలు తినడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
ప్రపంచంలోని అతి పెద్ద లిఫ్ట్.. ఎక్కడంటే.?
విజయవాడ వెళ్తే శివగిరి క్షేత్రం తప్పక దర్శించండి..
ఈ ఏడాది ఎంత మంది భారతీయ పౌరసత్వం వదులుకున్నారో తెలుసా?