ఈ ఏడాది ఎంత మంది భారతీయ పౌరసత్వం వదులుకున్నారో తెలుసా?

07 December 2024

TV9 Telugu

టెక్నాలజీ యుగంలో ఆకాశమే హద్దుగా దూసుకుపోతన్నారు భారతీయులు. మనోళ్ల నైపుణ్యానికి విదేశాలు రెడ్‌కార్పెట్‌ స్వాగతాలు.

టెక్నాలజీ యుగంలో క్రమంగా పెరుగుతున్న ట్రెండ్‌.. విదేశాల్లో పౌరసత్వం తీసుకుని స్థిరపడుతున్న భారతీయులు.

2022లో రెండు లక్షల 25వేల 620 మంది మాతృభూమి పౌరసత్వాన్ని వదులుకుని, విదేశాల్లో సెటిల్‌. అమెరికా పౌరసత్వం తీసుకున్న 71,991 మంది.

2023లో పౌరసత్వం వదులుకున్న 2,16,000 మంది భారతీయులు. ఆస్ట్రేలియా పౌరసత్వం తీసుకున్న 40,377 మంది భారతీయులు.

2024లో ఇప్పటిదాకా పౌరసత్వం వదులుకున్న 87,026 మంది భారతీయులు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూకేల్లో పౌరసత్వం తీసుకుని స్థిరపడేందుకు మొగ్గు.

2011 నుంచి 2023 వరకు పది లక్షల 75వేల మంది భారతీయులు మాతృభూమి పౌరసత్వం వదులుకుని విదేశాల్లో సెటిల్ అయ్యారు.

విదేశాల్లో మంచి అవకాశాలు ఉండటం, మెరుగైన జీవితం వంటి అంశాలు- విదేశాల్లో స్థిరపడి, అక్కడి పౌరసత్వం తీసుకోవడానికి కారణం.

మనదేశంలో ద్వంద్వ పౌరసత్వం లేకపోవడంతో, విదేశాల్లో పౌరసత్వం తీసుకుంటే, ఇక్కడి సిటిజన్‌షిప్‌ వదులుకోవాల్సిందే..!