ప్రపంచంలోని అతి పెద్ద లిఫ్ట్‌.. ఎక్కడంటే.? 

07 December 2024

TV9 Telugu

ప్రపంచంలోనే అతి పెద్ద ఎలివేటర్! లోపల సోఫాలు కూడా ఉన్నాయి. ఇందులో మొత్తం 200 మంది ప్రజలు కలిసి ఎక్కవచ్చు.

ఎత్తైన భవనంలో, ఒక అంతస్తు నుండి మరొక అంతస్తుకు వెళ్లడానికి లిఫ్ట్ ఉపయోగిస్తుంటారు. ఇది చాలా సౌకర్యాన్ని ఉంటుంది.

ఎత్తైన భవనాలతో పాటు షాపింగ్ మాల్స్, రైల్వేలు, మెట్రో స్టేషన్లలో కూడా లిఫ్ట్‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

తాజాగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన లిఫ్ట్‌కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతోంది.

ముంబైలోని జియో వరల్డ్ ప్లాజా మాల్‌లో ఏర్పాటు చేసిన ఈ లిఫ్ట్ విలాసవంతమైన ప్యాలెస్ కంటే తక్కువేమి కాదు.

ముంబైలోని జియో వరల్డ్ ప్లాజాలో ఏర్పాటు చేసిన ఈ లిఫ్ట్ బరువు దాదాపు 17 టన్నులు. కూర్చోవడానికి లిఫ్టు లోపల సోఫాలు కూడా పెట్టారు.

దాదాపు 200 మంది ఈ లిఫ్ట్‌లో ఒకేసారి ఎక్కవచ్చు. లిఫ్ట్ లోపలి దృశ్యం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. హోటల్ లాగా అలంకరించారు.

ముంబై జియో వరల్డ్ ప్లాజా 1 నవంబర్ 2023న సాధారణ ప్రజల కోసం తెరిచారు. ఇక్కడ బట్టలు, ఎలక్ట్రానిక్ ఉపకరణాల, అన్ని బ్రాండ్ స్టోర్లు ఉన్నాయి.