విజయవాడ వెళ్తే శివగిరి క్షేత్రం తప్పక దర్శించండి.. 

07 December 2024

TV9 Telugu

మీరు ఆదివారం సెలవు కాబట్టి విజయవాడ వెళ్లాలి అనుకొంటే మొగాల్రాజ్ పురంలో ప్రసిద్ధ శైవక్షేత్రం శివగిరికి తప్పక వెళ్ళండి.

విజయవాడలో ఉన్న ఈ శివగిరి క్షేత్రంలో 40 అడుగుల లింగాకారంలో ఆ పరమేశ్వరుడు అక్కడి భక్తులకు దర్శనమిస్తారు.

ఈ శివగిరి క్షేత్రం ప్రశాంతమైన వాతావరణానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రతి రోజు శివునికి నిత్యాభిషేకాలు జరుగుతాయి.

15 సంవత్సరాముల క్రితం న్యాయవాది మల్లికార్జున శర్మ తన తల్లికి ప్రతీకగా ఈ శివగిరి క్షేత్రాన్ని నిర్మించారు.

ఈ ప్రసిద్ధ శివగిరి క్షేత్రంలో ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో మధ్య నిత్యం శివ పరివారం జరుగుతుంది.

శివుని 12 జ్యోతిర్లింగలు, అమ్మరి అష్టదశ శక్తిపీఠ రూపాలు ఈ శివగిరి క్షేత్రంలో భక్తులకు దర్శనమిస్తాయి.

విజయవాడలోని ఈ క్షేత్రంలో ఉన్న 36 అడుగుల ఈశ్వరుని లింగకారం నుంచి నిరంతరం నీటి చుక్కలు జారీ పడుతూ ఉంటాయి.

మానసిక బాధలు ఉన్నవారు ఈ శివగిరి క్షేత్రం దర్శించుకోవటంతో సమస్యలు తొలగి ఆనందకరమైన మానసిక వికాసం పొందుతారు.