చాక్లెట్లంటే ఇష్టపడని వారు ఎవరుంటారు? చాక్లెట్లను తినడానికి, వాటితో చేసిన డ్రింక్స్ తాగడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతారు. అయితే ఈ చాక్లెట్లలో చాలా రకాలు ఉన్నాయి
TV9 Telugu
వాటిలో డార్క్ చాక్లెట్లతో చాలా ఉపయోగాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో మంచి కొవ్వును పెంపొందించడం నుంచి గుండె ఆరోగ్యం వరకు చాలా ప్రయోజనాలను డార్క్ చాక్లెట్లు చేకూరుస్తాయి
TV9 Telugu
డార్క్ చాక్లెట్‌లో కోకో ఎక్కువగా ఉంటుంది.చక్కెర పరిమాణం పరిమితంగా ఉంటుంది. ఫైబర్, ఐరన్, యాంటీఆక్సిడెంట్లు కూడా ఇందులో కనిపిస్తాయి
TV9 Telugu
చాలా డార్క్ చాక్లెట్లలో ఇతర తీపి స్నాక్స్ కంటే చాలా తక్కువ మొత్తంలో చక్కెర ఉంటుంది. అయితే డార్క్ చాక్లెట్ తింటే రక్తంలో చక్కెర శాతం పెరుగుతుందేమో? అనే సందేహం చాలా మందికి ఉంటుంది
TV9 Telugu
డార్క్ చాక్లెట్‌ను తక్కువ పరిమాణంలో, అధిక కోకోతో తింటే అది రక్తంలో చక్కెరను పెద్దగా పెంచదు. కానీ ఎక్కువ తినడం వల్ల కొంత రిస్క్
TV9 Telugu
కాబట్టి డయాబెటిక్ రోగులు పరిమిత పరిమాణంలో డార్క్ చాక్లెట్ తినవచ్చు. వారు 85% లేదా అంతకంటే ఎక్కువ కోకో, ఎక్కువ చక్కెర లేని డార్క్ చాక్లెట్‌ను ఎంచుకుంటే మంచిది
TV9 Telugu
ఒకటి లేదా రెండు చిన్న ముక్కలు అంటే రోజుకు 10-20 గ్రాముల డార్క్ చాక్లెట్ తింటే సరిపోతుంది. ఇలా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిని కూడా నియంత్రణలో ఉంచుతుంది
TV9 Telugu
ఇది కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. డార్క్ చాక్లెట్ మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. అయితే కిడ్నీలో రాళ్లు, మైగ్రేన్‌లతో బాధపడే రోగులు డార్క్ చాక్లెట్ తినకూడదు