సీతాఫలం సీజన్ వచ్చేసింది.. ఒక్క పండుతో బోలెడు లాభాలు..

samatha

2 october 2026

Pic credit - Pinterest

ఏ సీజన్‌లో దొరికే పండ్లను ఆ సీజన్‌లో తప్పకుండా తినాలని చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు. ఇవి హెల్త్‌కు చాలా మేలు చేస్తాయని చెబుతుంటారు.

సీజనల్ ఫ్రూట్స్

అయితే ఇప్పుడు సీతాఫలం సీజన్ ప్రారంభం అయ్యింది. మార్కెట్‌లో ఎక్కడ చూసినా సరే ఈ పండ్లే కనిపిస్తున్నాయి.

సీతాఫలం సీజన్

కాగా, ఇప్పుడు మనం సీతాఫలం పండు ఒక్కటి తిన్నా కూడా శరీరానికి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

ఆరోగ్య ప్రయోజనాలు

సీతాఫలం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వలన జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి కాపాడుతుంది.

జలుబు, దగ్గు సమస్యలు

అంతేకాకుండా జీర్ణక్రియ ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన కడుపు సమస్యలను తగ్గిస్తుంది.

జీర్ణక్రియ ఆరోగ్యం

సీతాఫలం గుండె ఆరోగ్యానికి కూడా అనేక విధాలుగా మేలు చేస్తుంది. ఇందులో పొటాషియం, మెగ్నీషియం ఉండటం వలన అధిక రక్తపోటును కంట్రోల్ చేస్తుంది.

గుండెకు మేలు

ఇక చర్మ ఆరోగ్యానికి కూడా ఇది చేసే మేలు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విటమిన్ ఏ కంటి చూపును మెరుగు పరుస్తుంది. చర్మ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

చర్మ ఆరోగ్యం

ప్రతి రోజూ ఒక సీతాఫలం తినడం వలన ఇది ఎముకలను బలంగా తయారు చేస్తుంది. ఎముకల ఆరోగ్యానికి ఇది చాలా మేలు చేస్తుందని చెబుతున్నారు నిపుణులు.

ఎముకల బలం