వారెవ్వా! ధనియాల నీటితో ఇన్ని లాభాలా? తెలిస్తే రోజూ తాగుతారు!
samatha
12 september 2026
Pic credit - Pinterest
చాలా మంది కొత్తిమీరను వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది వంటలకు మంచి రుచిని ఇవ్వడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది.
అయితే కొత్తిమీర మాత్రమే కాకుండా కొత్తిమీర గింజలను కూడా పొడిగా చేసి వంటల్లో వేయడం వలన ఇది ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తుంది.
అయితే వీటన్నింటి కంటే, ధనియాల గింజల నీటిని ప్రతి రోజూ తాగడం వలన బోలెడు లాభాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అవి ఏవో చూసేద్దాం.
ధనియాల గింజల నీరు జీర్ణక్రియ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయంట. ప్రతి రోజూ తాగడం వలన కడుపు ఉబ్బరం, అజీర్ణం తగ్గుతుంది.
అంతే కాకుండా ప్రతి రోజూ ఈ నీరు తాగడం వలన ఇవి రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంచుతుంది. డయాబెటీస్ వారికి వరం.
ప్రతి రోజూ ఒక గ్లాస్ కొత్తిమీర గింజల నీరు తాగడం వలన ఇది చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, గుండె ఆరోగ్యానికి చాలా మే
లు చేస్తుంది.
అంతే కాకుండా శరీరంలో వేడిని తగ్గించడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది. రోజుకు ఒక గ్లాస్ తాగడం చాలా మంచిది.
అదే విధంగా ప్రతి రోజూ ఒక గ్లాస్ ధనియాల నీరు తాగడం వలన ఇది హార్మోన్ల పనితీరును మెరుగు పరుస్తుందని చెబుతున్నారు నిపుణులు.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఎర్ర బెండకాయలను ఎక్కువగా పండించే రాష్ట్రం ఏదో తెలుసా?
సూర్యుడు అస్తమించని ఏడు ప్రదేశాలు ఇవే.. అక్కడి వారు ఎలా నిద్రపోతారో తెలుసా?
ఎప్పుడైనా ఆలోచించారా? చెవులు లేకుండా పాములు ఎలా వింటాయి?