గుడ్లు అతిగా తీసుకొంటే.. సమస్యలను పాకెట్‎లో పెట్టుకొని తెరిగినట్టే.. 

14 October 2025

Prudvi Battula 

గుడ్లలో ఆహార కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. ఇది ఎక్కువగా తింటే రక్త కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. గుండె జబ్బులకు కారణం అవుతుంది.

గుడ్లు అధికంగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్, కార్డియాక్ అరిథ్మియా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

వీటిలో అధిక కేలరీలు బరువు పెరగడానికి కారణం అవుతుంది. అందుకే గుడ్లను అతిగా తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు.

కొంతమందికి గుడ్లు అధికంగా తింటే విరేచనాలు, ఉబ్బరం లేదా కడుపు తిమ్మిరి వంటి జీర్ణ సమస్యలు ఎదురవుతాయి.

గుడ్డు అలెర్జీలు ఉన్నవారిలో దద్దుర్లు, దురద, వాపు మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి కలిగిస్తుంది.

గుడ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అందుకే ఇవి మోతాదులో మాత్రమే తినాలి.

ఎక్కువ గుడ్లు తినడం వల్ల పోషకాల అసమతుల్యత ఏర్పడుతుంది. దీనివల్ల ఇతర ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాల లోపాలు ఏర్పడతాయి.

పచ్చి లేదా సరిగ్గా ఉడికించని గుడ్లు తినడం వల్ల సాల్మొనెల్లా వంటి ఆహార సంబంధిత అనారోగ్యాలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.