స్టార్ ఫ్రూట్ మీ డైట్‎లో ఉంటే.. ఆ సమస్యలపై వార్ డిక్లేర్ చేసినట్టే.. 

10 August 2025

Prudvi Battula 

వెయిట్‌ లాస్‌ జర్నీలో ఉన్నవారు స్టార్ ఫ్రూట్ పండు తింటే మంచిది. ఇందులో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారు వారికి మంచిది.

దీనిలోని ఫైబర్‌ ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఇది ఎక్కువ కేలరీలను బర్న్‌ చేస్తుంది. ఫలితంగా బరువు కంట్రోల్‌లో ఉంటుంది.

ఈ స్టార్ ప్రూట్లో విటమిన్ ఎ, బి , సి పుష్కలంగా ఉన్నాయి. ఇది చర్మ, జుట్టు సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది.

స్టార్ ఫ్రూట్‌లోని విటమిన్ సి.. యాంటీఆక్సిడెంట్‌గా పనిచేసి చర్మం రంగు మెరిసేలా చేస్తుంది.  మొటిమల, ముడతలు తగ్గించి వృద్ధాప్యాన్ని నెమ్మదిస్తుంది.

స్టార్ ఫ్రూట్‌లో విటమిన్ సితో పాటు, యాంటీఆక్సిడెంట్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఈ కాంబినేషన్ రోగనిరోధక శక్తిని రెట్టింపు చేస్తుంది.

ఈ పండులో మెగ్నీషియం, ఐరన్, జింక్, మాంగనీస్, పొటాషియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి.

గుండె సమస్యలతో బాధపడుతున్నవారికి కూడా ఈ పండు ఎంతగానో సహాయపడుతుంది. ఇది తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

స్టార్ ఫ్రూట్‌లో విటమిన్ బి లభిస్తుంది. ఇది తీసుకోవడం వల్ల మీ జుట్టు మూలాల నుంచి బలపడుతుందన్నది వైద్యుల మాట.

చుండ్రు సమస్యతో బాధపడుతున్నవారికి స్టార్ ఫ్రూట్‌తో ప్రయోజనం చేకూరుతుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.