ఆకారంలోనే కాదు.. లాభాల్లోనూ స్టార్.. స్టార్ ఫ్రూట్‌తో ఆ సమస్యలు పరార్..
09 October 2025
Prudvi Battula
స్టార్ ఫ్రూట్లోవిటమిన్ సి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది.
స్టార్ ఫ్రూట్‌లోని పొటాషియం కంటెంట్ రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. గుండెపోటు ప్రమాదాన్ని నివారిస్తుంది.
ఇందులో తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ ఉంటుంది. నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి మంచి ఎంపిక.
ఇది జీర్ణక్రియను సజావుగా సాగేలా చేస్తుంది. ఇది ఆరోగ్యకరమైన గట్ బాక్టీరియాను ప్రోత్సహించి ప్రేగు కదలికలను పెంచుతుంది.
స్టార్ ఫ్రూట్‌లోని ఫైబర్ గ్లూకోజ్ శోషణను నెమ్మదించి రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది. ఇది డయాబెటిస్‌ను అదుపులో ఉంచుతుంది.
దీనిలో విటమిన్ సి అకాల వృద్ధాప్యానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడుతుంది. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.
ఇందులో విటమిన్ ఎ, ఫ్లేవనాయిడ్లు దృష్టిని మెరుగుపరచడంలో, మాక్యులర్ క్షీణత ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
స్టార్ ఫ్రూట్ సహజ మూత్రవిసర్జనను పెంచడం ద్వారా శరీరం నుండి విషాన్ని బయటకు పంపడంలో సహాయపడుతుంది. కాలేయం, మూత్రపిండాలు సమర్థవంతంగా పనిచేసేలా చేస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఇంటి ముందు కొబ్బరి చెట్టును పెంచవచ్చా.? పండితుల మాటేంటి.?
ఫ్రెంచ్ ఫ్రైస్‌తో షుగర్ వస్తుందా.? పరిశోదనలు ఏం చెబుతున్నాయి.?
పీతలను డైట్లో చేర్చుకున్న ఆదిలాబాద్ ప్రజలు.. కారణం అదేనా.?