రోజూ నువ్వులు తింటే.. అనారోగ్యాన్ని అజ్ఞాతంలోకి పంపినట్టే..

13 August 2025

Prudvi Battula 

నువ్వులలో ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి.

నువ్వులు కాల్షియం, మెగ్నీషియం, ఇతర ఖనిజాలతో సమృద్ధిగా ఉన్నందున ఎముకల ఆరోగ్యానికి సహాయపడతాయి. బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

నువ్వులలోని ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

ఇందులో ఫైబర్ ప్రేగు కదలికలను మెరుగువుపరచడంలో ఉపయోగపడుతుంది. ఇది ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు తోడ్పడుతుంది.

వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

నువ్వు గింజల్లో యాంటీఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మాన్ని దెబ్బతినకుండా ఆరోగ్యం ఉండేలా చేస్తుంది.

నువ్వు గింజలు వాపును తగ్గించడంలో, ఆర్థరైటిస్ తగ్గించడంలో సహాయపడే శోథ నిరోధక సమ్మేళనాలను కలిగి ఉంటాయి.

నువ్వులలోని ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.