గుడ్డులోని పచ్చసొన మంచిది కాదా..? వాస్తవం ఇదే

13 October 2025

Prudvi Battula 

ఒక మీడియం సైజ్ కోడిగుడ్డులో ప‌చ్చ సొన ద్వారా మ‌న‌కు 55 క్యాల‌రీల శ‌క్తి, ప్రోటీన్లు 2.7 గ్రాములు, కొవ్వులు 4.5 గ్రాములు, కొలెస్ట్రాల్ 184 మిల్లీగ్రాములు లభిస్తాయి.

శరీరానికి రోజుకు 300 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ కావాలి. ఒక కోడిగుడ్డును ప‌చ్చ‌ని సొన‌తో పాటు తిన‌వ‌చ్చు. విడిచిపెట్టాల్సిన ప‌నిలేదు.

ప‌చ్చ‌సొన‌ను తిన‌క‌పోతే విట‌మిన్లు డి, బి12, ఎ, ఇ, కెల‌తోపాటు ఐర‌న్‌, సెలీనియం, ఫాస్ఫ‌ర‌స్‌, కోలిన్‎లు వంటి పోష‌కాల‌ను కోల్పోతారు.

కోడిగుడ్డులోని ప‌చ్చ సొన‌లో కోలిన్ పుష్కలంగా ఉన్నందున మెద‌డు ప‌నితీరు మెరుగుప‌డుతుంది. ముఖ్యంగా చిన్నారుల తెలివితేట‌లు పెరిగి చ‌దువుల్లో రాణిస్తారు.

ప‌చ్చసొన‌లో లుటీన్‌, జియాజాంతిన్ అనే స‌మ్మేళ‌నాలు క‌ళ్ల‌ను ర‌క్షిస్తాయి. కంటి చూపును మెరుగుపరుస్తాయి.

ఇందులో అధికం లభించే విట‌మిన్ డి ఎముక‌ల‌ను దృఢంగా చేస్తుంది. అలాగే రోగ నిరోధ‌క శ‌క్తిని మెరుగుపరుస్తుంది.

గుడ్డు పచ్చ‌సొన‌లో ఉండే ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు విట‌మిన్లు ఎ, డి, ఇ, కె పోష‌కాహార లోపం లేకుండా కాపాడుతాయి.

దీనిలోని ఐర‌న్ వాళ్ళ ర‌క్తం వృద్ధి చెంది ర‌క్త‌హీన‌త త‌గ్గుతుంది. అయితే గుండె జ‌బ్బులు, అధిక కొలెస్ట్రాల్, అల‌ర్జీలు ఉన్న‌వారు ప‌చ్చసొన‌కు దూరంగా ఉండాలి.