డార్క్ చాక్లెట్ తింటే.. ఆ సమస్యలన్నీ తుస్.!

13 September 2025

Prudvi Battula 

డార్క్ చాక్లెట్‌లో అధిక మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి, కణాల నష్టం నుండి రక్షించడంలో సహాయపడతాయి.

డార్క్ చాక్లెట్‌లోని ఫ్లేవనాయిడ్లు రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో, రక్తపోటును తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తాయి.

దీన్ని తినడం వల్ల ఒత్తిడి దూరం అవుతుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరచి బ్రెయిన్ హెల్త్ బూస్టప్ చేస్తుంది.

ఇందులో ఫ్లేవనాయిడ్లు మెదడు, ఇతర అవయవాల సరైన రక్త ప్రసరణకు సహాయపడతాయి. ఇది మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

దీనిలో యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని UV కాంతి వల్ల కలిగే నష్టం నుండి రక్షించడంలో సహాయపడతాయి. చర్మాన్ని హైడ్రేట్ చేస్తాయి.

కొన్ని అధ్యయనాలు డార్క్ చాక్లెట్ ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయని సూచిస్తున్నాయి.

డార్క్ చాక్లెట్‌లో మెగ్నీషియం, రాగి వంటి ఖనిజాలు ఎముకల ఆరోగ్యానికి చాలా అవసరం. బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

డార్క్ చాక్లెట్‌లో కేలరీలు, కొవ్వు అధికంగా ఉన్నందున మితంగా తీసుకోవడం మంచిది. లేదంటే బరువు పెరిగే అవకాశం ఉంది.