నల్ల వంకాయ అనారోగ్యంపై గాండీవం..
05 August 2025
Prudvi Battula
నల్ల వంకాయలో ఫైబర్ ఎక్కువగా, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను, గ్లూకోజ్ శోషణను నియంత్రించడానికి సహాయపడుతుంది.
దీనిలోని యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం, ఫైబర్ రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను, గుండె సమస్యల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి.
నల్ల వంకాయలో తక్కువ కేలరీలు ఉన్నందున ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దీంతో బరువు తగ్గుతారు.
నల్ల వంకాయలో మెదడు కణాలను దెబ్బతినకుండా రక్షించే, జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే ఫైటోన్యూట్రియెంట్లు ఉంటాయి.
కాల్షియం, ఐరన్, ఫినోలిక్ సమ్మేళనాలు నల్ల వంకాయలో సమృద్ధిగా ఉన్నందున ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.
ఇందులోని ఫైబర్ ప్రేగు కదలికలను నియంత్రిస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది, ప్రేగులలో ప్రయోజనకరమైన బ్యాక్టీరియాను పోషించడం ప్రోత్సహిస్తుంది.
నల్ల వంకాయ యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్లతో నిండి ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
నల్ల వంకాయలోని యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి. దీంతో క్యాన్సర్ రాదు.
మరిన్ని వెబ్ స్టోరీస్
మీ డైట్లో మునగ ఆకులు ఉంటే.. ఆ సమస్యలకు దడ పుట్టాల్సిందే..
కలలో రక్తం, మాంసం, బంగారం కనిపిస్తే.. మంచి చిహ్నమా.? చెడు చిహ్నమా.?
ఈ వస్తువులు ఇంట్లో ఉంటే దరిద్రం సల్సా డ్యాన్స్ చేస్తుంది..