అంజీర్‎తో లైంగిక బలహీనతకు చెక్.. ఆ సమస్యలన్నీ ఖతం.. 

24 September 2025

Prudvi Battula 

మీకు లైంగిక బలహీనత ఉంటే 2-3 అత్తి పండ్లను పాలలో రాత్రంతా నానబెట్టి ఉదయన్నే వాటిని తినడం లైంగిక శక్తి మెరుగుపరుస్తుంది.

అంజీర్‌లో డైటరీ ఫైబర్ జీర్ణక్రియను ప్రోత్సహించి మలబద్ధకాన్ని నివారిస్తుంది. పేగు ఆరోగ్యానికి తోడ్పడుతుంది.

అంజీర్‌లోని కరిగే ఫైబర్ జీర్ణవ్యవస్థలో కొలెస్ట్రాల్‌ను తొలగించడానికి సహాయపడుతుంది. దీంతో ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది.

ఇందులో కాల్షియం, మెగ్నీషియం, ఇతర ఖనిజాలు బలమైన ఎముకలను నిర్వహించి బోలు ఎముకల వ్యాధిని నివారించడానికి ముఖ్యమైనవి.

దీనిలోని ఫైబర్ రక్తప్రవాహంలో చక్కెర శోషణను నెమ్మదింపజేయడంలో సహాయపడుతుంది. ఇది రక్తంలో చక్కెర నిర్వహణలో సహాయపడుతుంది.

అంజీర్‌లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. అలాగే గుండె ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడుతుంది.

ఇది యాంటీఆక్సిడెంట్లును కలిగి ఉన్నందున శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షించి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

దీనిలోఫైబర్ కంటెంట్ కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. ఇది బరువు నిర్వహణ సహాయపడుతుంది. దీంతో వెయిట్ తగ్గుతారు.