చికెన్ vs మటన్‌.. ఈ రెండిటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్ ?

30 August 2025

Prudvi Battula 

100 గ్రా చికెన్ బ్రెస్ట్‌లో దాదాపు 31గ్రా ప్రోటీన్ ఉంటుంది. ఇది తక్కువ కాలొరీలు, తక్కువ కొవ్వు కలిగి ఉంటుంది.

100 గ్రా మటన్‌లో సుమారు 25 నుంచి 27గ్రా ప్రోటీన్ ఉంటుంది. ఇందులో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్ విషయంలో చికెన్ మంచి ఎంపిక.

చికెన్‎లో తక్కువ సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. ఒక చికెన్ బ్రెస్ట్ పీస్‎లో సుమారుగా 165 కాలొరీలు ఉంటాయి.

మటన్‌లో సాచురేటెడ్ ఫ్యాట్ అధికంగా ఉన్నందున గుండెకు హానికరం. దీనిలో సుమారు 250 నుంచి 300 కాలొరీలు ఉంటాయి. కాబట్టి తక్కువ ఫ్యాట్, తక్కువ కాలొరీల కోసం చికెన్ ఉత్తమం,

చికెన్ చాలా తేలికగా జీర్ణమవుతుంది. దీంతో సమస్య లేకుండ చిన్న పిల్లలు, వృద్ధులు ఏ వయసువారైనా సులభంగా తినవచ్చు.

మటన్ చాలా నెమ్మదిగా జీర్ణమవుతుంది. కిడ్నీ, లివర్ సమస్యలున్నవారికి ఇది మంచిది కాదు. జీర్ణశక్తి విషయంలో చికెన్ మంచి ఎంపిక.

చికెన్ బలమైన ప్రోటీన్ మూలం, బరువు తగ్గే వారికి అనుకూలంగా ఉంటుంది.  మటన్‌లో ఐరన్, జింక్ వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.

ప్రతి వారంలో 2 నుంచి 3 సార్లు మాత్రమే మాంసాహారం తినడం ఆరోగ్యపరంగా మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.