దానిమ్మపళ్లు కొంటున్నారా..? బీకేర్‌ఫుల్..! 

31 August 2025

Prudvi Battula 

దానిమ్మతో జీవితం ఆరోగ్యవంతం అవుతుంది. దానిమ్మలో విటమిన్ కె, సి, బి, ఐరన్ ఉంటాయి. ఇవన్నీ శరీరానికి మేలు చేస్తాయి.

దానిమ్మ తింటే శరీరానికి ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. దీంతో రక్తహీనత సమస్య ఉండదు. అలాగే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

దానిమ్మ పండులో ముఖ్యంగా మెగ్నిషియం, సెలీనియం, జింక్ ఉంటుంది. అందుకే దానిమ్మ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

దానిమ్మ.. పండు, తొక్క, గింజలు, పూలు అన్నీ పోషకాలను ఇచ్చేవే. అయితే వీటిలో కొనే విషయంలో కొన్ని జాగ్రత్తలు ముఖ్యం అంటున్నారు నిపుణులు.

తరచుగా మనం దానిమ్మపండు కొనడానికి మార్కెట్‌కి వెళ్ళినప్పుడు, దాని రంగు చూసి కొంటాము.  వాటి రంగు చూసి ఎప్పుడూ కొనకండి. వాటి రంగు వాటి రకాన్ని బట్టి ఉంటుంది.

దానిమ్మ పండు కొనేటపుడు దాని తొక్కపై శ్రద్ధగా గమనించండి. తొక్క కొంచెం గట్టిగా, కొద్దిగా మెరుస్తూ ఉండేదాన్ని కొనండి.

దానిమ్మపండును చేతిలోకి తీసుకుని దాని బరువును చూసుకోండి. దానిమ్మపండు బరువుగా ఉంటే, దానిమ్మ గింజలు ధాన్యంగా ఉన్నాయని అర్థం.

దానిమ్మ గింజలు మృదువుగా ఉండాలని కూడా గుర్తుంచుకోండి. ఈ విషయాలన్నింటినీ తనిఖీ చేయడం ద్వారా మీరు తీపి, జ్యుసి దానిమ్మలను సులభంగా కొనుగోలు చేయవచ్చు.