ఆ చార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఈయన చాలా విషయాల గురించి తెలియజేయడం జరిగింది ముఖ్యంగా ఒక వ్యక్తి ఎదుగుదలకు సంబంధించిన అనేక విషయాలు తెలిపారు.
చాణక్యుడు నీతి శాస్త్రం అనే పుస్తకాన్ని రచించి, దాని ద్వారా నేటి తరం వారికి ఉపయోగ పడే ఎన్నో గొప్ప విషయాలు తెలిపారు. అవి ఈ తరం వారికి ఎంతో ఉపయోగ కరంగా ఉన్నాయి.
ఇక చాణక్యుడు సహాయం చేయడం గురించి కూడా కొన్ని విషయాలు తెలియజేశారు. సహాయం చేసే విషయంలో కూడా కొన్ని సార్లు ఆలోచించాలంట.
చాణక్య నీతి ప్రకారం, కొంతమందికి సహాయం చేయకుండా ఉండటమే మలు అంట. ఎందుకంటే తనకు తాను హానీ చేసుకున్నట్లే కాబట్టి కొన్ని సార్లు సహాయం చేసే ముందు ఎక్కువ ఆలోచించాలంట.
ఇతరులను సులభంగా మోసం చేసే వ్యక్తి తన సొంత ప్రయోజనాల కోసమే ఇతరులను వాడుకునే వ్యక్తికి సహాయం చేయడం అస్సలే మంచిది కాదు అని చెబుతున్నాడు చాణక్యుడు.
అలాగే, సోమరిగా ఉండే వ్యక్తికి కూడా సహాయం చేయకూడదంట, ఇతరుల సంపాదనపై ఆధారపడి బతికే వ్యక్తికి సహాయం చేసినా ఎలాంటి ప్రయోజనం ఉండదంట.
చాణక్య నీతి ప్రకారం, మీరు పదే పదే సహాయం చేసినప్పటికీ, గౌరవం చూపని వ్యక్తికి సహాయం చేసినా వ్యర్థమే అంటున్నారు ఆ చార్య చాణక్యుడు.