చాణక్యనీతి : భార్య చేసే ఈ చిన్న తప్పులే భర్త ఆయుష్షు తగ్గిస్తాయంట!

samatha 

27 JUN  2025

Credit: Instagram

భార్య భర్తల బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మూడు ముళ్లబంధంతో ఒక్కటైన ఇద్దరూ కష్టాల్లో నష్టాల్లో పాలు పంచుకుంటూ జీవిస్తారు.

ఇక వైవాహిక బంధానికి హిందూ సంప్రదాయంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి భార్య భర్తను గౌరవించాలి, అలాగే భర్త భార్య ఇష్టానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెబుతుంటారు.

అంతే కాకుండా అనేక గ్రంధాలలో కూడా భార్య భర్తల బంధం గురించి ఎంతో గొప్పగా తెలియజేయడం జరిగింది. అలాగే చాణక్యుడు కూడా వైవాహిక జీవితం గురించి గొప్పగా చెప్పారు.

ఆయన తన నీతి శాస్త్రంలో అనేక విషయాల గురించి ప్రస్తావించడం జరిగింది. అలాగే, ఒక మహిళ సౌభాగ్యం గురించి ఆయన తన నీతిశాస్త్రంలో తెలియజేశారు.

భార్య అలవాట్లు ఆమె భర్త వయసును ప్రభావితం చేస్తాయని చెబుతున్నాడు ఆచార్య చాణక్యుడు.  అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.

భార్య భర్త ఇష్టానికి విరుద్ధంగా ఏదైనా చేస్తే, అది భర్తపై మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందంట. అందువలన భార్య ఏ పని చేసినా భర్త సమ్మతి అవసరం అంట.

చాణక్యనీతి ప్రకారం భర్త అనుమతి లేకుండా భార్య ఉపవాసం ఆచరించకూడదంట. భర్త అనుమతి ఉంటేనే పాటించాలంట. లేకపోతే అది భర్త వయసుపై ప్రభావం చూపుతుందంట.

అదే విధంగా భర్త ఇష్టానికి వ్యతిరేకంగా భార్య ఏ పని చేయకూడదంట. దీని వలన భర్త ఆయుషు తగ్గే ఛాన్స్ ఎక్కువగా ఉంటది అంటున్నారు చాణక్యుడు.