ఆచార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి పని లేదు. ఈయన గొప్ప పండితుడు. అనేక విషయాలపై మంచి పరిజ్ఞానం ఉన్న వ్యక్తి.
చాణక్యుడు తన నీతి శాస్త్రం ద్వారా అనేక విషయాల గురించి వివరించడం జరిగింది. అవి నేటి తరం వారికి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటున్నాయి.
విజయం, ఓటమి, తప్పు ఒప్పులు, బంధాలు, బంధుత్వాలు గురించి చాణక్యుడు తన నీతి శాస్త్రం ద్వారా వివరంగా తెలియజేయడం జరిగింది.
అయితే ఒక వ్యక్తి తెలిసి, తెలియక చేసే కొన్ని తప్పుల వలన వారి జీవితం నాశనం కాక తప్పదు అని చెబుతున్నాడు చాణక్యుడు అవి ఏవి అంటే?
చాణక్యుడు సహవాసం గురించి చెబుతున్నాడు. తప్పుడు వ్యక్తులతో సవాహసం చేస్తే నాశనం తప్పదు, అది మీ వ్యక్తిత్వాన్ని, మీ భవిష్యత్తును నాశనం చేస్తుంది అని చెప్తున్నాడు.
అహంకారం ఉన్న వ్యక్తి ఎప్పుడూ జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోలేడంట. అహంకరం వలన ఆలోచన శక్తి తగ్గిపోయి తప్పుడు నిర్ణయాలతో జీవితం నాశనం చేసుకుంటారంట.
అలాగే, సమయం విలువ తెలియని వ్యక్తి కూడా తన జీవితాన్ని అంధకారంలోకి నెట్టేస్తాడంట. సమయం వెళ్లిపోతే మళ్లీ రాదని గుర్తుంచుకోవాలంటున్నాడు చాణక్యుడు.
అలాగే ఏ వ్యక్తి అయినా సరే చేయాలి అనున్నది, చేయడానికి నిర్ణయించుకున్నది ఏదైనా సరే, గోప్యంగా ఎవరితో పంచుకోకుండా ఉన్నప్పుడే వారు సక్సెస్ అవుతారంట.